Accident Tragedy: ఢిల్లీ-ముంబయి ఎక్స్ప్రెస్వేపై శనివారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న 15 అడుగుల ఎత్తు నుంచి కాలువలో పడిపోయింది. రాజస్థాన్లోని కోటా సమీపంలో జరిగిన ఈ విషాదకర ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Read Also: Gold silver Jewellery: బంగారం, వెండి ఆభరణాలపై కేంద్రం సంచలన నిర్ణయం

Accident Tragedy: నిద్రమత్తు వల్లే ప్రమాదం.. ఖాటూ శ్యామ్ ఆలయానికి వెళ్తుండగా ఘటన
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం, రాజస్థాన్లోని కోటా జిల్లా, సిమ్లియా పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం సుమారు 6 గంటల సమయంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరంతా మధ్యప్రదేశ్లోని భోపాల్ నుంచి రాజస్థాన్లోని ప్రసిద్ధ ఖాటూ శ్యామ్ ఆలయ దర్శనానికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారడం వల్లే బస్సు అదుపుతప్పి, రక్షణ కంచెను బలంగా ఢీకొట్టి లోయలో పడిపోయినట్లు తెలుస్తోంది.
క్షతగాత్రులకు చికిత్స
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాలుగు అంబులెన్సుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని కోటాలోని ఎంబీఎస్ ఆసుపత్రి, న్యూ మెడికల్ కాలేజీ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. కోటా జిల్లా కలెక్టర్ పీయూష్ సమారియా, ఐజీ హరేంద్ర మహావర్ ఆసుపత్రిని సందర్శించి క్షతగాత్రులకు అందుతున్న వైద్య సేవలను సమీక్షించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:






