☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

5 నెల‌ల లివ్ ఇన్.. పెళ్లికి ముఖం చాటేసిన ప్రియుడు!

బెంగళూరు నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. కలిసి జీవించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఒక యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. న్యాయం చేయాలని కోరుతూ ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హాసన్‌ జిల్లాకు చెందిన సూర్య (26), కేరళకు చెందిన నిష్మ (26) బెంగళూరులోని ఒకే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆఫీసు పరిచయం కాస్తా వారి మధ్య ప్రేమగా మారింది. దాంతో గత ఐదు నెలలుగా వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. మొదట్లో […] The post 5 నెల‌ల లివ్ ఇన్.. పెళ్లికి ముఖం చాటేసిన ప్రియుడు! appeared first on Adya News Telugu.
5 నెల‌ల లివ్ ఇన్.. పెళ్లికి ముఖం చాటేసిన ప్రియుడు!

బెంగళూరు నగరంలో దారుణ ఘటన వెలుగు చూసింది. కలిసి జీవించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ఒక యువతి తీవ్ర మనస్తాపానికి గురైంది. న్యాయం చేయాలని కోరుతూ ఆమె పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

హాసన్‌ జిల్లాకు చెందిన సూర్య (26), కేరళకు చెందిన నిష్మ (26) బెంగళూరులోని ఒకే ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నారు. ఆఫీసు పరిచయం కాస్తా వారి మధ్య ప్రేమగా మారింది. దాంతో గత ఐదు నెలలుగా వీరిద్దరూ కలిసి సహజీవనం చేస్తున్నారు. మొదట్లో పెళ్లికి సూర్య తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కానీ ఆ తర్వాత వారు మాట మార్చారు. మరోవైపు నిష్మ ఇంట్లో కూడా ఈ వివాహానికి వ్యతిరేకత ఎదురైంది.

ఈ క్రమంలో సెప్టెంబర్ 24న సూర్య తన ఫోన్‌ను అక్కడే వదిలేసి అదృశ్యమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో నిష్మ తట్టుకోలేకపోయింది. తీవ్ర వేదనతో పురుగుల మందు తాగింది.

ఆత్మహత్యాయత్నానికి ముందు ఆమె ఒక సెల్ఫీ వీడియోను రికార్డు చేసింది. తన పరిస్థితికి సూర్య, అతని తల్లిదండ్రులు, స్నేహితుడు ప్రవీణ్ కారణమని అందులో పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై మహాలక్ష్మి లేఔట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

The post 5 నెల‌ల లివ్ ఇన్.. పెళ్లికి ముఖం చాటేసిన ప్రియుడు! appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్‌ శర్మ?భారత్‌లో ఉద్యోగాలకు ఏఐ ముప్పు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com