☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్‌ శర్మ?

ఐపీఎల్‌ 2027 సీజన్‌లో సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ స్వీకరించబోతున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. ప్రస్తుత సారథి హార్దిక్ పాండ్యా జట్టును వీడనున్నాడని, దాంతో రోహిత్‌కు తిరిగి పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ఊహాగానాలన్నింటినీ ముంబై ఇండియన్స్ వర్గాలు కొట్టిపారేశాయి. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. వచ్చే ఐపీఎల్ సీజన్ కెప్టెన్సీపై ఇప్పటివరకు జట్టు యాజమాన్యం ఎలాంటి చర్చలు […] The post ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్‌ శర్మ? appeared first on Adya News Telugu.
ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్‌ శర్మ?

ఐపీఎల్‌ 2027 సీజన్‌లో సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్‌ కెప్టెన్సీ బాధ్యతలను మళ్లీ స్వీకరించబోతున్నాడంటూ సామాజిక మాధ్యమాల్లో వార్తలు జోరుగా ప్రచారమయ్యాయి. ప్రస్తుత సారథి హార్దిక్ పాండ్యా జట్టును వీడనున్నాడని, దాంతో రోహిత్‌కు తిరిగి పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ఊహాగానాలన్నింటినీ ముంబై ఇండియన్స్ వర్గాలు కొట్టిపారేశాయి. ఆ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.

వచ్చే ఐపీఎల్ సీజన్ కెప్టెన్సీపై ఇప్పటివరకు జట్టు యాజమాన్యం ఎలాంటి చర్చలు జరపలేదని ముంబై వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి హార్దిక్ పాండ్యానే సారథిగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో హార్దిక్ జట్టును వీడితే మాత్రమే ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తామని పేర్కొన్నాయి. ఆ పరిస్థితి ఎదురైతే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లేదా మిచెల్ సాంట్నర్ వంటి ఆటగాళ్లు జట్టును నడిపించడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశాయి.

గతంలో రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఏకంగా ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) ఐపీఎల్ ట్రోఫీలను గెలుచుకుంది. అయితే 2024 సీజన్‌కు ముందు రోహిత్‌ స్థానంలో హార్దిక్‌ పాండ్యాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. హార్దిక్ కెప్టెన్సీలో జట్టు తొలి ఏడాది పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరుకున్నప్పటికీ టైటిల్‌ను దక్కించుకోలేకపోయింది.

మరోవైపు 2027 ఐపీఎల్ సమయానికి రోహిత్‌ శర్మ వయసు దాదాపు 40 ఏళ్లకు చేరుకుంటుంది. అదే ఏడాది వన్డే ప్రపంచకప్‌ కూడా జరగనుంది. దీంతో ఆటగాడిగా అతడి భవిష్యత్తుపై క్రీడా వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒకవేళ రోహిత్ ఆటగాడిగా కొనసాగకపోయినా, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీకి మెంటార్‌గా వ్యవహరించే అవకాశాలు బలంగా ఉన్నాయని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

The post ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్‌ శర్మ? appeared first on Adya News Telugu.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ఆలియాస్ రుక్మిణీ.. ఈమె ఎవరంటే?5 నెల‌ల లివ్ ఇన్.. పెళ్లికి ముఖం చాటేసిన ప్రియుడు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com