☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Teachers | జిల్లాలో టీచర్స్‌ కొరత.. ఉమ్మడి పాలమూరులో వెయ్యి మందికి పైగా అవసరం!

Teachers | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరును టీచర్ల కొరత వేధిస్తున్నది. జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నది.
Teachers | జిల్లాలో టీచర్స్‌ కొరత.. ఉమ్మడి పాలమూరులో వెయ్యి మందికి పైగా అవసరం!

Teachers | హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా ఉమ్మడి పాలమూరును టీచర్ల కొరత వేధిస్తున్నది. జోగుళాంబ గద్వాల, నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నది. ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్‌ నియోజకవర్గం.. నారాయణపేట, వికారాబాద్‌ జిల్లాల కిందికే వస్తున్నది. మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లానూ టీచర్ల కొరత వేధిస్తున్నది. ఈ నాలుగు జిల్లాల్లోనే వెయ్యి మందికిపైగా ఉపాధ్యాయుల అవసరమున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ మీడియం బోధించే టీచర్ల కొరత సైతం విద్యా వ్యవస్థను పట్టిపీడిస్తున్నది. ఉర్దూ మీడియంలో 600 మంది ఉపాధ్యాయులు కావాల్సి ఉన్నది.

ముందుకు సాగని బోధన..

జోగుళాంబ గద్వాల జిల్లాలోని కేటీదొడ్డి, గట్టు, రాజోలి, అయిజ, గద్వాల, మానవపాడు మండలాల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యార్థులున్నా, పాఠాలు చెప్పలేని పరిస్థితులు నెలకొన్నాయి. నారాయణపేట జిల్లాలో 300 మంది, వికారాబాద్‌లో 150 మంది ఉపాధ్యాయుల కొరత ఉన్నది. వికారాబాద్‌లో దుద్యాల, దౌల్తాబాద్‌ మండలాల్లో ఈ సమస్య అధికంగా ఉన్నది. హైదరాబాద్‌ , సిద్దిపేట జిల్లాలో ఉర్దూ మీడియం టీచర్ల కొరత ఉన్నట్టు ఉపాధ్యాయ సంఘాలు ఆరోపిస్తున్నాయి. టీచర్ల కొరతను అధిగమించేందుకు 1,600కు పైగా ఇన్‌స్ట్రక్టర్లను నియమించేందుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపినట్టు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← VBG RAM G | గ్రామీణ ఉపాధికి గండి.. తగ్గిన వీబీజీ రామ్‌జీ పనిదినాలు!Yadadri Lands | ఇక యాదాద్రిలో భూముల విక్రయం.. జిల్లాలో భూముల అమ్మకానికి హెచ్‌ఎండీఏ ప్రణాళికలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com