☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

VBG RAM G | గ్రామీణ ఉపాధికి గండి.. తగ్గిన వీబీజీ రామ్‌జీ పనిదినాలు!

VBG RAM G | రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో గ్రామీణ ఉపాధికి భారీగా గండిపడింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉపాధి పనులు మందగించడం వల్ల కూలీల జీవనోపాధికి మరింత ఆందోళనకరంగా మారింది.
VBG RAM G | గ్రామీణ ఉపాధికి గండి.. తగ్గిన వీబీజీ రామ్‌జీ పనిదినాలు!

VBG RAM G | హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనలో గ్రామీణ ఉపాధికి భారీగా గండిపడింది. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఉపాధి పనులు మందగించడం వల్ల కూలీల జీవనోపాధికి మరింత ఆందోళనకరంగా మారింది. గతంలో ఉపాధి హామీ పనులు గ్రామీణ పేద కూలీల కుటుంబాలకు భరోసాగా ఉండగా, ఇప్పుడు పని దినాలు తగ్గడంతో కుటుంబ పోషణ భారంగా మారుతున్నది.

రాష్ట్రంలో వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌, అజీవికా మిషన్‌ (వీబీ-జీ-రామ్‌-జీ) పథకం కింద కల్పిస్తున్న ఉపాధి పనిదినాలు గణనీయంగా తగ్గడం ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో 2024-25లో 1,222.87 లక్షల పనిదినాలు కల్పించగా, 2025-26లో ఆ సంఖ్య 731.63 లక్షలకు తగ్గింది. ఈ పథకం కింద ఉపాధి పొందిన గ్రామీణ కుటుంబాల సంఖ్య కూడా తగ్గింది. 2024-25లో 26.69 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించగా, 2025-26లో ఈ సంఖ్య 22.08 లక్షలకు పడిపోయింది. అంటే ఏడాది వ్యవధిలో 17.2 శాతం తగ్గుదల నమోదైంది.

జాబ్‌కార్డుల్లో భారీగా కోత

గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడం, ప్రజలు జీవనోపాధిని కొనసాగించేందుకు తోడ్పడటమే ఈ పథకం లక్ష్యం. కానీ, ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో గ్రామీణ కుటుంబాలకు ఈ పథకం అక్కరకు రాకుండా పోతున్నది. చాలామంది కుటుంబాలు 100 రోజుల పనిని కూడా పూర్తి చేయలేకపోయాయి. 2024-25లో 92,688 కుటుంబాలు 100 రోజుల ఉపాధిని పూర్తి చేశాయి.

2025-26లో ఈ సంఖ్య కేవలం 23,228 కుటుంబాలకు పడిపోయింది. మరోవైపు పథకం నుంచి తొలగించిన జాబ్‌ కార్డుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. 2024-25లో 80,166 జాబ్‌ కార్డులు (3,35,542 మంది కూలీలు) తొలగించగా, 2025-26లో 1,25,980 జాబ్‌ కార్డులు (5,44,955 మంది కూలీలు) తొలగించారు. నకిలీ నమోదులు, శాశ్వత వలసలు, కూలీల మరణాల వల్లనే ఈ కార్డులను తొలగించినట్టు ప్రభుత్వం తెలిపింది.

యాప్‌ ఆధారిత హాజరులో సాంకేతిక సమస్యలు

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) స్థానంలో వీబీజీ రామ్‌జీ అమల్లోకి వచ్చిన తర్వాత కూలీల హాజరును యాప్‌ ద్వారా నమోదు చేసే ప్రక్రియలో సమస్యలు ఎదురయ్యాయి. నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సర్వీస్‌ (ఎన్‌ఎంఎంఎస్‌), ఈ-కేవైసీ ద్వారా హాజరు నమోదు, ఇతర వివరాలను అప్‌లోడ్‌ చేసే సమయంలో తొలుత రాష్ట్రంలో సాంకేతిక, నిర్వహణపరమైన ఇబ్బందులు తలెత్తాయి.

2026-27 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ -జూన్‌ మధ్య 649.58 లక్షల పనిదినాలు కల్పించారు. 2025-26 ఇదే కాలంతో పోలిస్తే ఇది 23 శాతం అధికమని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 2024-25, 2025-26 సంవత్సరాలకు సంబంధించి ఎలాంటి వేతన బకాయిలు లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

అదనపు పనులు చేర్చాలని విజ్ఞప్తి

ఎల్‌ నినో ప్రభావంతో గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా (వీబీ-జీ-రామ్‌-జీ) పథకం కింద అదనపు పనులను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేసింది. పథకంలో అదనపు కార్యకలాపాలను చేర్చడం ద్వారా గ్రామీణ ప్రజల జీవనోపాధిని మెరుగుపరచడంతోపాటు పంటల వైవిధ్యీకరణకు కూడా ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నది.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ విజ్ఞప్తులపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. వర్షాభావ పరిస్థితుల్లో గ్రామీణ కుటుంబాలకు అదనపు ఉపాధి అవకాశాల కల్పనపై ఇంకా స్పష్టత రావాల్సి ఉన్నది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← TET Results | ఇన్‌ సర్వీస్‌ టెట్‌ ఫలితాలు రిలీజ్‌.. 6,728 మంది టీచర్లు ఫెయిల్‌Teachers | జిల్లాలో టీచర్స్‌ కొరత.. ఉమ్మడి పాలమూరులో వెయ్యి మందికి పైగా అవసరం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com