☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Charlapalli | ప్రణయ్ ‘పరువు హత్య’.. గుండెపోటుతో ఏ4 మృతి..!

Charlapalli : ఎనిమిదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులోని నాలుగో నిందితుడు గుండెపోటుతో మృతి చెందాడు. చర్లపల్లి జైలులో మగ్గుతున్న ఏ4 అబ్దుల్ బారీ గురువారం మరణించాడు.
Charlapalli | ప్రణయ్ ‘పరువు హత్య’.. గుండెపోటుతో ఏ4 మృతి..!

Charlapalli : ఎనిమిదేళ్ల క్రితం సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులోని నాలుగో నిందితుడు గుండెపోటుతో మృతి చెందాడు. చర్లపల్లి జైలులో మగ్గుతున్న ఏ4 అబ్దుల్ బారీ గురువారం మరణించాడు. ఛాతిలో నొప్పితో బాధ పడుతున్న అతడిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అబ్దుల్ ప్రాణాలు విడిచాడు. దాంతో, ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు చనిపోయారు. ప్రధాన నిందితుడు మారుతి రావు ఆరేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకోగా.. ఇప్పుడు అబ్దుల్ గుండెపోటుతో మరణించాడు.

తెలంగాణలో ఎనిమిదేళ్ల క్రితం నాటి ప్రణయ్‌ పరువు హత్య కేసులో నాలుగో నిందితుడైన అబ్దుల్ బారీ మరణించాడు. 2025 మార్చిలో నల్లగొండ కోర్టు తీర్పు అనంతరం.. చర్లపల్లి జైల్లో ఉంటున్న అతడికి గురువారం గుండెపోటు వచ్చింది. దాంతో, పోలీసులు వెంటనే అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కానీ, అక్కడ చికిత్స పొందుతూ అబ్దుల్ ప్రాణాలు విడిచాడని పోలీసులు తెలిపారు. ఏ4 అయిన అతడి మరణంతో ఈ కేసులో మిగిలిన నిందితులు ఇద్దరు మాత్రమే. ఒకరు కాంట్రాక్ట్ కిల్లర్ సుభాష్‌ కుమార్ శర్మ (కోర్టు ఉరిశిక్ష విధించింది), రెండో వ్యక్తి అమృత బాబాయి శ్రవణ్ కుమార్‌(బెయిల్‌ వచ్చింది).

దళితుడు అని సుపారీ ఇచ్చి..

ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్, అమృత జీవితంలో 2018 సెప్టెంబర్ 14 చీకటి రోజుగా మిగిలిపోయింది. గర్భిణి అయిన అమృతను ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రణయ్‌ను కాంట్రాక్ట్ కిల్లర్ సుభాష్ కుమార్ శర్మ కత్తితో నరికి చంపాడు. దళితుడైన ప్రణయ్‌ హత్యోదంతం అప్పట్లో పెద్ద సంచలనం. ఈ కేసును విచారించిన నల్గొండ కోర్టు అబ్దుల్ బారీతో సహా ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు, సుభాష్‌కు మరణ శిక్ష విధించింది.

ఈ కేసులో విచారణ కొనసాగుతుండగానే 2020, మార్చి 8వ తేదీన అమృత తండ్రి, ప్రధాన నిందితుడు మారుతి రావు ఎలుకల మందు తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు అమృత బాబాయ్ శ్రవణ్ కుమార్‌కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. జీవిత ఖైదును సవాల్ చేస్తూ అతడు పిటిషన్ దాఖలు చేయగా, ఆ పిటిషన్ విచారణ ముగిసేవరకు తనకు బెయిల్ ఇవ్వాలని శ్రవణ్ కోర్టును కోరాడు. అతడి వయసు, జైలు జీవితాన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు బెయిలు ఇచ్చింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Heat In Body | వేడిగా ఉన్న వాతావ‌ర‌ణంలో ఎక్కువ సేపు ఉంటే క‌నిపించే ల‌క్ష‌ణాలు ఇవే.. ఏం చేయాలంటే..?daughter-in-law’s marriage | కుమారుడు మరణించిన కొన్ని రోజులకే.. కొడలికి పెళ్లి జరిపించిన అత్త →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com