☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

daughter-in-law’s marriage | కుమారుడు మరణించిన కొన్ని రోజులకే.. కొడలికి పెళ్లి జరిపించిన అత్త

daughter-in-law's marriage | కుమారుడు మరణించడంతో కోడలి భవిష్యత్తు గురించి అత్త ఆలోచించింది. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మరో పెళ్లి చేయాలని నిర్ణయించింది. చివరకు ఒక వ్యక్తితో కోడలికి వివాహం జరిపించించింది. ఆమెకు కొత్త జీవితాన్ని అందించింది.
daughter-in-law’s marriage | కుమారుడు మరణించిన కొన్ని రోజులకే.. కొడలికి పెళ్లి జరిపించిన అత్త

లక్నో: కుమారుడు మరణించడంతో కోడలి భవిష్యత్తు గురించి అత్త ఆలోచించింది. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మరో పెళ్లి చేయాలని నిర్ణయించింది. చివరకు ఒక వ్యక్తితో కోడలికి వివాహం జరిపించించింది. ఆమెకు కొత్త జీవితాన్ని అందించింది. (daughter-in-law’s marriage) ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌కు చెందిన మీనాక్షికి పదేళ్ల కిందట ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌ జిల్లాకు చెందిన రోహిత్‌తో పెళ్లి జరిగింది. ఈ దంపతులకు ఏడేళ్ల రితూ, ఏడాదిన్నర వయసున్న అవిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారు సంతోషంగా కుటుంబ జీవితాన్ని గడుపుతున్నారు.

కాగా, విధి వక్రీకరించడంతో వారి జీవితాలు మారిపోయాయి. మేస్త్రీగా పనిచేస్తున్న రోహిత్‌ తండ్రి క్యాన్సర్‌తో బాధపడుతూ ఆగస్ట్‌ 14న మరణించాడు. అయితే తండ్రి మరణాన్ని తట్టుకోలేని రోహిత్‌ ఆ మరునాడైన ఆగస్ట్‌ 15న చనిపోయాడు. దీంతో ఇద్దరు చిన్న కుమార్తెలతో మీనాక్షి ఒంటరిగా మిగిలింది.

మరోవైపు ఈ విషాద సమయంలో కోడలు మీనాక్షి భవిష్యత్తు గురించి అత్త సునీత ఆలోచించింది. ఒక స్థిరమైన జీవితాన్ని గడిపే అవకాశం ఆమెకు కల్పించాలని నిర్ణయించింది. మరో పెళ్లి అంశంపై మీనాక్షితో పాటు ఆమె కుటుంబ సభ్యులతో చర్చించింది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్‌ 23న రాజస్థాన్‌లోని నారాయణపూర్‌కు చెందిన చాట్ విక్రేత యోగేష్‌తో కోడలు మీనాక్షికి అత్త సునీత పెళ్లి జరిపించింది. స్థానిక ఆర్య సమాజ్ ఆలయంలో ఈ వివాహ వేడుక జరిగింది. మీనాక్షి మరిది అయిన మోహిత్, ఆమెకు సోదరుడి పాత్ర పోషించాడు. ‘కన్యాదానం’ ఘట్టాన్ని నిర్వహించాడు.

అలాగే అత్త సునీత కూడా సాంప్రదాయ బాధ్యతలను నిర్వర్తించింది. కోడలకు కొత్త జీవితం అందించడం పట్ల ఆమె చాలా ఆనందం వ్యక్తం చేసింది. మీనాక్షి కొత్త ఇంటికి మారినప్పటికీ ఆమెతో సంబంధాన్ని కొనసాగిస్తామని, కోడలితో ఉన్న అనుబంధాన్ని అలాగే ఉంచుతామని అత్త సునీత, మరిది మోహిత్ మాట ఇచ్చారు. కొత్త జీవితం ఆరంభం పట్ల మీనాక్షి కూడా సంతోషంగా కనిపించింది. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Charlapalli | ప్రణయ్ ‘పరువు హత్య’.. గుండెపోటుతో ఏ4 మృతి..!Telangana | బ్రేకింగ్.. 22A భూములపై ప్రభుత్వం సంచలన ప్రకటన..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com