☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

మాదాపూర్‌లో ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. ఇంటికెళ్లి నిందితుడు సూసైడ్ అటెంప్ట్

మాదాపూర్‌లో ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. ఇంటికెళ్లి నిందితుడు సూసైడ్ అటెంప్ట్
మాదాపూర్‌లో ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. ఇంటికెళ్లి నిందితుడు సూసైడ్ అటెంప్ట్
మాదాపూర్‌లో ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. ఇంటికెళ్లి నిందితుడు సూసైడ్ అటెంప్ట్

హైదరాబాద్: మాదాపూర్‌లో ఓయోలో యువతి మృతి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస రవితేజ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఇంట్లోనే ఆత్మహత్యాయత్నం చేయగా గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు రవితేజది ఏపీలోని పరవాడ మండలం ఏడుమెట్ల మర్రిపాలెం గ్రామం. రవితేజ సూసైడ్ అటెంప్ట్ చేసిన విషయాన్ని పరవాడ పోలీసులు హైదరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు.

మాదాపూర్లోని ఓ హోటల్లో విశాఖపట్టణానికి చెందిన యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తీవ్ర గాయాలతో ఆమెను దవాఖానకు తరలించిన ప్రియుడు అనంతరం పరారవడం, హోటల్ గది గోడలు, బెడ్‎పై రక్తపు మరకలు ఉండటంతో పోలీసులు దీనిని హత్యగా అనుమానిస్తున్నారు. మాదాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. విశాఖపట్టణానికి చెందిన షరోన్ నిఖిత టోప్నో (29) హైదరాబాద్లో ఓ ప్రైవేటు జాబ్ చేస్తోంది.

వైజాగ్ కే చెందిన శ్రీనివాస రవితేజను ఆమె ప్రేమించింది. అయితే, కుటుంబ సభ్యులు వేరే వ్యక్తికిచ్చి పెండ్లి చేయడంతో, ఆమె భర్తకు విడాకులు ఇచ్చి హైదరాబాద్ వచ్చి ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఒంటరిగా ఉంటోంది. సోమవారం మధ్యాహ్నం రవితేజ, నిఖిత మాదాపూర్ సిద్దిక్ నగర్ రోడ్డు నంబర్ 5లోని ఓఎస్ఎల్ఎనయూ హోటల్ రూమ్కు వెళ్లారు. అయితే, మంగళవారం తెల్లవారుజామున తీవ్ర గాయాలతో ఉన్న నిఖితను.. శ్రీనివాస రవితేజ, హోటల్ సిబ్బంది కలిసి కొత్తగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

ఆమెను పరీక్షించిన డాక్టర్లు అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. డాక్టర్ల ద్వారా విషయం తెలిసిన వెంటనే శ్రీనివాస రవితేజ అక్కడి నుంచి పరారయ్యాడు. హాస్పిటల్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో మాదాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. నిఖిత ముఖం, తలపై తీవ్రమైన గాయాలు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

క్లూస్ టీమ్ తో కలిసి హోటల్ రూమ్ను పరిశీలించగా.. గోడలు, బెడ్ట్పై రక్తపు మరకలు కనిపించాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిఖితను ఆమె ప్రియుడే హత్య చేసి ఉంటాడని భావిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.


html, body,
⬇ Full News JPG⬇ Short News JPG
← మాజీ సైనికుల భూమి వారికే ఇవ్వాలె..గవర్నర్ కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖబీసీ జనాభా లెక్కల్లో గోల్మాల్.. TRP చీఫ్ తీన్మార్ మల్లన్న →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com