☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు.. రూ.8,500ల జరిమానా

పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు.. రూ.8,500ల జరిమానా Caption of Image. ములుగు, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు వెలువరించారు. అందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సుధీర్ రాంనాథ్​ కేకన్ మీడియాకు వివరించారు. ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన మాతూరి రమేశ్​ 2020లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై శ్రీనివాస్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు. శుక్రవారం విచారణలో దోషిగా తేలడంతో జడ్జి సూర్య చంద్రకళ నిందితుడు మాతూరి రమేశ్​కు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.8,500 జరిమానా విధించారు. కేసులో బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆ
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు.. రూ.8,500ల జరిమానా
పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు.. రూ.8,500ల జరిమానా

ములుగు, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ జిల్లా జడ్జి తీర్పు వెలువరించారు. అందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సుధీర్ రాంనాథ్​ కేకన్ మీడియాకు వివరించారు. ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన మాతూరి రమేశ్​ 2020లో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడటంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై శ్రీనివాస్ పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరు పరిచారు.

శుక్రవారం విచారణలో దోషిగా తేలడంతో జడ్జి సూర్య చంద్రకళ నిందితుడు మాతూరి రమేశ్​కు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.8,500 జరిమానా విధించారు. కేసులో బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

కేసు పరిష్కారంతోపాటు నిందితుడికి శిక్షపడేలా సాక్ష్యాలు ప్రవేశపెట్టిన ఏఎస్పీ మనన్ భట్, సీఐ సూర్యప్రకాశ్, ఎస్సై టీవీ సూరి, కోర్టు మానిటరింగ్ ఆఫీసర్​ డీఎస్పీ కిషోర్, లైజనింగ్ అధికారి, ఏఎస్సై కుమారస్వామి, సీడీవోలు మైనిక, మంగీలాల్ ను ఎస్పీ అభినందించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← పట్టణ పారిశుధ్యాన్ని మెరుగుపరుస్తాం: ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ఐలమ్మ జయంతి వేడుకలకు తరలిరండి: బీసీ రాజ్యాధికార సమితి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com