☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Sanghavi: అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. సంఘవి ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా.?

90వ దశకం తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. అప్పట్లో హీరోలతో పాటు హీరోయిన్లకూ మంచి ప్రాధాన్యం ఉండేది. సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, సంఘవి వంటి కథానాయికలు తమ అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అప్పటి యువతలో సంఘవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.
Sanghavi: అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. సంఘవి ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా.?
Sanghavi

90వ దశకం తెలుగు సినిమా ప్రేక్షకులకు ఎన్నో అందమైన జ్ఞాపకాలను మిగిల్చింది. అప్పట్లో హీరోలతో పాటు హీరోయిన్లకూ మంచి ప్రాధాన్యం ఉండేది. సౌందర్య, రమ్యకృష్ణ, రంభ, సంఘవి వంటి కథానాయికలు తమ అందం, నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా అప్పటి యువతలో సంఘవికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కర్ణాటకలోని మైసూరుకు చెందిన సంఘవి అసలు పేరు కావ్య రమేష్. 1993లో సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆమె.. దక్షిణాది భాషల్లో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

Sanghavi Pic

దాదాపు 15 ఏళ్ల కెరీర్‌లో 80కి పైగా సినిమాల్లో నటించిన సంఘవి.. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ప్రేక్షకులను అలరించారు. అందులో తెలుగులోనే 38 సినిమాలు ఉన్నట్లు పలు సినీ డేటాబేస్‌లు పేర్కొంటున్నాయి. 1993లో ‘కొక్కరకో’ అనే తెలుగు సినిమాతో సంఘవి టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అదే ఏడాది తమిళంలో ‘అమరావతి’ సినిమాలో అజిత్ కుమార్ సరసన నటించే అవకాశం దక్కింది. ‘అమరావతి’ అజిత్ హీరోగా నటించిన తొలి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

Sanghavi Latest

ఆ తర్వాత విజయ్ సరసన ‘రసిగన్’లో నటించడంతో తమిళ ప్రేక్షకుల్లోనూ సంఘవికి మంచి గుర్తింపు వచ్చింది. అక్కడి నుంచి తమిళంతో పాటు కన్నడ, మలయాళ సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటూ దక్షిణాది హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సంఘవి. 1995లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన తాజ్‌మహల్ సంఘవి కెరీర్‌లో కీలకమైన మలుపుగా నిలిచింది. ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంఘవి ముఖ్యమైన పాత్రలో కనిపించారు. ఈ సినిమా విజయంతో తెలుగులో ఆమెకు వరుస అవకాశాలు రావడం మొదలైంది.

Sanghavi New

ఆ తర్వాత నాయుడుగారి కుటుంబం, సరదా బుల్లోడు, ప్రియమైన శ్రీవారు, అబ్బాయిగారి పెళ్లి, పట్టుకోండి చూద్దాం వంటి సినిమాల్లో నటిస్తూ టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్‌గా మారిపోయారు. సంఘవి కెరీర్‌లో అత్యంత గుర్తుండిపోయే సినిమాల్లో కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘సింధూరం’ ఒకటి. తన నటన, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా ఆమె కెరీర్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించడమే కాకుండా, సంఘవికి ఉత్తమ నటిగా నంది అవార్డు దక్కిన చిత్రంగా కూడా గుర్తింపు పొందింది. ‘సింధూరం’ తర్వాత సంఘవి వరుసగా పలు విజయవంతమైన తెలుగు చిత్రాల్లో కనిపించారు.

Sanghavi Latest Pic

సూర్యవంశం, శివయ్య, సమరసింహారెడ్డి, సీతారామరాజు, ప్రేయసి రావే, లాహిరి లాహిరి లాహిరిలో, సందడే సందడి తదితర చిత్రాలు ఆమె కెరీర్‌లో భాగమయ్యాయి. సంఘవి తెలుగు, తమిళ సినిమాల్లో వరుస అవకాశాలు అందుకున్నారు. స్టార్ హీరోల సినిమాల్లోనూ నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు. సినీ కెరీర్‌లో మంచి స్థాయిలో ఉన్న సమయంలోనే సంఘవి వ్యక్తిగత జీవితంపై దృష్టి పెట్టారు. 2016 ఫిబ్రవరి 3న బెంగళూరులో ఐటీ రంగంలో పనిచేసే వెంకటేష్‌ను వివాహం చేసుకున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← రేపే ఇన్‌ సర్వీస్‌ టీచర్ల TET ఫలితాలు 2026.. ఎన్ని గంటలకంటే?తెల్ల అన్నం కంటే మూడు రెట్లు ఎక్కువ.. తింటే, శరీరంలో వాపులు మొత్తం మాయం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com