☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

తెల్ల అన్నం కంటే మూడు రెట్లు ఎక్కువ.. తింటే, శరీరంలో వాపులు మొత్తం మాయం

మనం తినే ఆహారంలో బియ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, బియ్యం అతి తక్కువ పోషక పదార్థాలు, తక్కువ ప్రోటీన్, తక్కువ ఫైబర్, అధిక కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుందని చాలామందికి తెలియదు. అధిక కార్బోహైడ్రేట్లు, తక్కువ ప్రోటీన్, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం ఆరోగ్యానికి అంత మంచిది కాదు
తెల్ల అన్నం కంటే మూడు రెట్లు ఎక్కువ.. తింటే, శరీరంలో వాపులు మొత్తం మాయం
Quinoa 1

మన దైనందిన ఆహారంలో బియ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే, బియ్యం అతి తక్కువ పోషక పదార్థాలు, తక్కువ ప్రోటీన్, తక్కువ ఫైబర్, అధిక కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుందని చాలామందికి తెలియదు. అధిక కార్బోహైడ్రేట్లు, తక్కువ ప్రోటీన్, తక్కువ ఫైబర్ ఉన్న ఆహారం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొర్రలు, రాగులు, జొన్నలు, సజ్జలు, అరికెలు, ఊదలు వంటి చిరుధాన్యాలు మంచి పోషకాలను అందిస్తున్నప్పటికీ, క్వినోవా (కీన్వా) వీటి అన్నింటికంటే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉందని నిపుణులు చెబుతున్నారు.

Quinoa 3

క్వినోవా అధిక పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇందులో ముఖ్యంగా క్వర్సెటిన్, కెంఫెరాల్ అనే కెమికల్ కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు సమ్మేళనాలు శరీరంలో వాపులను (ఇన్ఫ్లమేషన్) తగ్గించడంలో, అవి రాకుండా రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపించబడింది

Quinoa 4

భారతదేశంలో 90% మందికి ప్రోటీన్ లోపం ఉంది. పెసలు, శెనగలు, చిక్కుడు, సోయా చిక్కుడు, రాజ్మా వంటివి ప్రోటీన్‌ను అందిస్తాయి. కానీ కొంతమందికి ఇవి గ్యాస్ సమస్యలను కలిగిస్తాయి, కాబట్టి వాటిని తినరు. దీనివల్ల ప్రోటీన్ లోపం మరింత పెరుగుతుంది. ఈ సమస్యకు క్వినోవా ఒక అద్భుత పరిష్కారం. 100 గ్రాముల క్వినోవాలో సుమారు 14 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది అన్ని రకాల అవసరమైన అమైనో ఆమ్లాలను అధిక మోతాదులో కలిగి ఉంటుంది. ఈ అమైనో ఆమ్లాలు రక్షణ వ్యవస్థ (ఇమ్యూనిటీ) బూస్ట్ అవ్వడానికి, కణజాలం సక్రమంగా పనిచేయడానికి అత్యవసరం. క్వినోవా శరీరానికి బలాన్ని, అధిక ఫైబర్, అధిక ప్రోటీన్, తక్కువ కార్బోహైడ్రేట్లు మరియు అనేక సూక్ష్మ పోషకాలను అందిస్తుంది.

Quinoa 5

డబ్బుల ఇబ్బంది లేనివారందరూ క్వినోవాను తమ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. కష్టపడేవారు, ఎదిగే వయసు పిల్లలు, క్రీడాకారులు, జిమ్ వ్యాయామాలు చేసేవారు, గర్భిణులు, బాలింతలు వంటి వారికి క్వినోవా చాలా మేలు చేస్తుంది. వీరు తమ ఆహారంలో 50-60% క్వినోవా అన్నం, 40% కూరలు కలిపి తీసుకోవచ్చు.బరువు తగ్గాలనుకునేవారు, మధుమేహులు, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ తగ్గాలనుకునేవారు క్వినోవాను తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఎక్కువ కూరలు తిని, అప్పుడప్పుడు అన్నం తినాలనిపించినప్పుడు క్వినోవా రైస్‌ను ఎంచుకోవచ్చు.

Quinoa 6

ఇంకా దీనిలో ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం, గ్లూకోజ్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహులు కూడా దీనిని తినడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. అయితే, ప్రతిరోజూ అధిక మోతాదులో క్వినోవా అన్నం తీసుకుంటే బరువు పెరిగే అవకాశం కూడా ఉంది కాబట్టి, మితంగా, అవసరాన్ని బట్టి తీసుకోవడం ఉత్తమం. ఈ విధంగా క్వినోవాను సక్రమంగా వినియోగించుకుంటే సంపూర్ణ ఆరోగ్యానికి బాటలు వేస్తుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sanghavi: అప్పట్లో కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. సంఘవి ఇప్పుడు ఎలా ఉన్నారో చూశారా.?కేరళలో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు దిశగా అడుగులు.. మంత్రి కీలక ప్రకటన →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com