☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొంటున్నారా? కో-పేమెంట్, డిడెక్టిబుల్స్ అంటే ఏంటో తెలుసా..?

హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొంటున్నారా? కో-పేమెంట్, డిడెక్టిబుల్స్ అంటే ఏంటో తెలుసా..?
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొంటున్నారా? కో-పేమెంట్, డిడెక్టిబుల్స్ అంటే ఏంటో తెలుసా..?
హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొంటున్నారా? కో-పేమెంట్, డిడెక్టిబుల్స్ అంటే ఏంటో తెలుసా..?

హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రస్తుతం కో-పేమెంట్, డిడెక్టిబుల్స్ అనే అంశాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లపై తప్పనిసరిగా 10 శాతం కో-పేమెంట్ విధించే అంశాన్ని జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అసలు ఈ నిబంధనలు ఎలా పనిచేస్తాయి, వీటి వల్ల పాలసీహోల్డర్లకు ఉండే లాభనష్టాలు ఏమిటో స్పష్టంగా తెలుసుకుందాం రండి...

మొదటగా.. కో-పేమెంట్ అంటే పాలసీదారు తన క్లెయిమ్ మొత్తంలో నిర్ణీత శాతాన్ని స్వయంగా చెల్లించడం. ఉదాహరణకు హాస్పిటల్ బిల్లు రూ.2 లక్షల వస్తే క్లెయిమ్‌పై 10 శాతం కో-పేమెంట్ ఉంటే.. పాలసీదారు బిల్లులో రూ.20వేలు భరించాలి. మిగతా రూ. లక్షా 80వేలను ఇన్సూరెన్స్ కంపెనీ చెల్లిస్తుంది. ఇక డిడెక్టిబుల్ అనేది కవరేజ్ ప్రారంభం కావడానికి ముందే పాలసీహోల్డర్ భరించాల్సిన ఒక ఫిక్స్‌డ్ మొత్తం. ఉదాహరణకు రూ.50వేలు వార్షిక డిడెక్టిబుల్ ఉన్న పాలసీలో.. మొదటి రూ.50వేల ఖర్చును పాలసీదారులే చెల్లించాల్సి ఉంటుంది.

ఈ రెండు నిబంధనలు కూడా ఫైనాన్షియల్ రిస్క్‌ను ఇన్సూరెన్స్ సంస్థ, పాలసీదారు పంచుకునేలా చేస్తాయి. దీనివల్ల ప్రీమియంలు 40 నుంచి 50 శాతం వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్లాజులు ఎలా వర్తిస్తాయనేది చాలా ముఖ్యం. డిడెక్టిబుల్స్ కొన్నిసార్లు ప్రతి క్లెయిమ్‌కు విడివిడిగా వర్తిస్తే, మరికొన్నిసార్లు వార్షిక అగ్రిగేట్ ప్రాతిపదికన వర్తిస్తాయి. అదే కో-పేమెంట్ అయితే ప్రతి క్లెయిమ్‌పైనా వర్తిస్తుంది. దీనివల్ల పెద్ద క్లెయిమ్‌లు వచ్చినప్పుడు పాలసీహోల్డర్ల జేబుపై భారం విపరీతంగా పెరుగుతుంది.

ఎవరు ఈ పాలసీలను ఎంచుకోవాలనే దానిపై స్పష్టత ఉండాలి. యువకులు, ఆరోగ్యంగా ఉండేవారు సాధ్యమైనంతవరకు ఈ క్లాజులు లేని సాధారణ పాలసీలను తీసుకోవడం బెస్ట్. అయితే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి అధిక ప్రీమియంల నుంచి ఉపశమనం పొందడానికి ఈ నిబంధనలు ఉపయోగపడతాయి. కాబట్టి కొత్త పాలసీ తీసుకునే ముందు ఇన్సూరెన్స్ రూల్స్ క్షుణ్ణంగా చదవడం, భవిష్యత్ అవసరాల కోసం ఒక అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం. గుడ్డిగా తెలిసిన ఏజెంట్ చెప్పాడని కొనుక్కుంటే.. నిజంగా ఇన్సూరెన్స్ అవసరం వచ్చినరోజున ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని మర్చిపోకండి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← అమితాబ్ బచ్చన్‌ కు ఢిల్లీ హై కోర్టు బిగ్ షాక్.. స్వయంగా విచారణకు రావాల్సిందే అని ఆదేశం! ఎందుకంటే?గేమ్‌ను మలుపు తిప్పేది ఎవరు?: ఇంట్లో కూర్చుని బౌలింగ్ వ్యూహాలు రచించిన సూర్య →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com