☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

అమితాబ్ బచ్చన్‌ కు ఢిల్లీ హై కోర్టు బిగ్ షాక్.. స్వయంగా విచారణకు రావాల్సిందే అని ఆదేశం! ఎందుకంటే?

అమితాబ్ బచ్చన్‌ కు ఢిల్లీ హై కోర్టు బిగ్ షాక్.. స్వయంగా విచారణకు రావాల్సిందే అని ఆదేశం! ఎందుకంటే?
అమితాబ్ బచ్చన్‌ కు ఢిల్లీ హై కోర్టు బిగ్ షాక్.. స్వయంగా విచారణకు రావాల్సిందే అని ఆదేశం! ఎందుకంటే?
అమితాబ్ బచ్చన్‌ కు ఢిల్లీ హై కోర్టు బిగ్ షాక్.. స్వయంగా విచారణకు రావాల్సిందే అని ఆదేశం! ఎందుకంటే?

బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌కు ఢిల్లీ హైకోర్టు నుండి కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. తన అనుమతి లేకుండా పేరు, గొంతు, రూపురేఖలు (పర్సనాలిటీ రైట్స్) వాడుకుంటున్నారంటూ ఆయన వేసిన పిటిషన్‌పై విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణ సమయానికి సెటిల్మెంట్ పూర్తికాకపోతే.. వచ్చే విచారణకు స్వయంగా అమితాబే కోర్టుకు హాజరుకావాలని జస్టిస్ పురుషైంద్ర కుమార్ కౌరవ్ స్పష్టం చేశారు.

అసలేం జరిగింది?

2022లో అమితాబ్ తన పర్సనాలిటీ, పబ్లిసిటీ హక్కుల రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు. లాటరీ స్కీమ్‌లు, వ్యాపారాలు, డిజిటల్ ఉత్పత్తుల్లో తన వాయిస్, ముఖ చిత్రాన్ని అక్రమంగా వాడకుండా అప్పట్లోనే 'ఎక్స్ పార్టే' అజమాయిషీ ఉత్తర్వులు పొందారు. అయితే, కొందరు ప్రతివాదులతో రచ్చ లేకుండ మధ్యవర్తిత్వం (Mediation) ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలని చూశారు. ఒప్పందం దాదాపు ఖరారైనప్పటికీ.. బిగ్ బి వైపు నుంచి లాజిస్టికల్ కారణాల వల్ల సంతకాలు జాప్యమయ్యాయి.

నవంబర్ 16న బిగ్ డే..

ఈ జాప్యంపై సీరియస్ అయిన కోర్టు.. ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి సమయమిస్తూ తదుపరి విచారణను నవంబర్ 16, 2026కి వాయిదా వేసింది. అయితే ఒకవేళ ఒప్పందం పూర్తిగా ముగియకపోతే.. సీపీసీ (Code of Civil Procedure), కొత్త భారతీయ సాక్ష్య అధినియమ్, 2023 నిబంధనల ప్రకారం అమితాబ్‌ను నేరుగా ప్రశ్నించేందుకు ఆయన ప్రత్యక్షంగా కోర్టుకు హాజరుకావాల్సిందేనని కండీషన్ పెట్టింది.

సినిమాల్లో పవర్ ఫుల్ డైలాగులతో కోర్టు సీన్లను రక్తికట్టించే బిగ్ బీ.. నిజ జీవితంలో ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కుతారా? లేక నవంబర్ 16 లోపే లీగల్ డీల్ ముగించి వివాదానికి ఫుల్‌స్టాప్ పెడతారా? అనేది ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు వ్యాపార, న్యాయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఢిల్లీలో హై టెన్షన్.. కేజ్రీవాల్, మమతా బెనర్జీ అరెస్ట్.. పోలీసులపై రాళ్ల దాడిహెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కొంటున్నారా? కో-పేమెంట్, డిడెక్టిబుల్స్ అంటే ఏంటో తెలుసా..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com