☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Air India Pilot: జూరిచ్ టు ఢిల్లీ విమానం.. ఎయిర్ ఇండియా పైల‌ట్ స‌స్పెన్ష‌న్‌

Air India Pilot : ఆల్కాహాల్ ప‌రీక్ష‌లో ఎయిర్ ఇండియా కో-పైల‌ట్ దొరికిపోయాడు. దీంతో అత‌న్ని స‌స్పెండ్ చేశారు. జూరిచ్ ఎయిర్‌పోర్టులో సెప్టెంబ‌ర్ 6వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగింది. విమానం ఢిల్లీకి టేకాఫ్ తీసుకోవ‌డానికి ముందు ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.
Air India Pilot: జూరిచ్ టు ఢిల్లీ విమానం.. ఎయిర్ ఇండియా పైల‌ట్ స‌స్పెన్ష‌న్‌

న్యూఢిల్లీ: ఆల్కాహాల్ ప‌రీక్ష‌లో ఎయిర్ ఇండియా కో-పైల‌ట్(Air India Pilot) విఫ‌లం అయ్యాడు. దీంతో అత‌న్ని విధుల నుంచి త‌ప్పించారు. జూరిచ్ ఎయిర్‌పోర్టులో సెప్టెంబ‌ర్ 6వ తేదీన ఈ ఘ‌ట‌న జ‌రిగింది. అయితే విమానం ఢిల్లీకి టేకాఫ్ తీసుకోవ‌డానికి ముందు ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. జూరిచ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానానికి చెందిన కో-పైల‌ట్ తాగి ఉన్న‌ట్లు అధికారులు గుర్తించారు. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లో అత‌ను ఫెయిల్ అయిన‌ట్లు చెప్పారు. జూరిచ్‌లో నిర్వ‌హించిన రెండో ప‌రీక్ష ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఓ ప్యాసింజెర్ రూపంలో అత‌న్ని ఇండియాకు వెన‌క్కి పంపించారు. ప్ర‌స్తుతం అత‌ను స‌స్పెన్ష‌న్‌లో ఉన్నాడు.

తుది వైద్య ప‌రీక్ష రిపోర్టు కోసం అధికారులు వేచి చూస్తున్నారు. కో-పైల‌ట్ మ‌ద్యం మ‌త్తులో ఉన్న కార‌ణంగా… ఏఐ 151 విమానాన్ని షెడ్యూల్ ప్ర‌కారం న‌డ‌ప‌లేక‌పోయిన‌ట్లు అధికారులు చెప్పారు. ఆ విమానాన్ని మ‌రుస‌టి రోజు న‌డిపారు. క్ర‌మ‌శిక్ష‌ణ‌, బాధ్య‌త‌ను దృష్టిలో పెట్టుకుని ఆ పైల‌ట్ పై చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఎయిర్ ఇండియా చెప్పింది. ఈ ఘ‌ట‌నకు కొన్ని రోజుల ముందు ఫుకెట్ నుంచి ఢిల్లీ వ‌స్తున్న విమానంలోని పైల‌ట్ కూడా డ్ర‌గ్ ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలాడు. అత‌ను మారిజూనా తీసుకున్న‌ట్లు నిరార్ధ‌ణ అయిన విష‌యం తెలిసిందే.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← ‘సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు’పూల చీరలో దీపికా పిల్లి.. ప్రకృతి మధ్య పరువాల విందు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com