☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

‘సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు’

గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇళ్లతో పాటు గ్రామ పరిసరాల‌ను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు బూర్గంప‌హాడ్ మండ‌లం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ‌ సర్పంచ్ బానోత్ సరోజ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ...
‘సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు’

– నాగినేనిప్రోలు రెడ్డిపాలెం సర్పంచ్ బానోత్ సరోజ

బూర్గంపహాడ్, సెప్టెంబర్ 25 : గ్రామంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఇళ్లతో పాటు గ్రామ పరిసరాల‌ను పరిశుభ్రంగా ఉంచడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు బూర్గంప‌హాడ్ మండ‌లం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామ‌ సర్పంచ్ బానోత్ సరోజ అన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం గ్రామంలో ఉత్తమ పారిశుధ్య కార్మికుడు మహిమూద్‌ను పుష్పగుచ్ఛం, శాలువతో సత్కరించారు. ఫ్రైడే.. డ్రైడే కార్యక్రమాన్ని ఎస్సీ కాలనీలో నిర్వహించి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని అవగాహన కల్పించారు. ఇళ్లలో, మురుగునీటి కాలువలు, డ్రైనేజీల్లో నీరు నిల్వ ఉండకుండా, దోమలు వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు చేపట్టారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధులు ప్రబలకుండా నివారించవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్పిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కార్యదర్శి చేకూరి రవి, వార్డు సభ్యులు నర్సయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎం, ఆశాలు పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sonam Wangchuk | న‌న్ను ఎన్‌కౌంట‌ర్‌లో చంపేస్తారేమో.. సోన‌మ్ వాంగ్‌చుక్ ఆందోళ‌న‌Air India Pilot: జూరిచ్ టు ఢిల్లీ విమానం.. ఎయిర్ ఇండియా పైల‌ట్ స‌స్పెన్ష‌న్‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com