☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజాగా యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ బుధవారం రాత్రి బరేలీలోని మౌలానా తౌకీర్ రజా ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యుల్ని కలిశారు. మౌలానా తౌకీర్ రజా కుటుంబంతో భేటీ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతేడాది బరేలీ అల్లర్ల కేసులో రజా కీలక నిందితుడి ఉన్నారు, ప్రస్తుతం జైలులో ఉన్నారు. అజయ్ రాయ్ రజా […]
Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!

Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తాజాగా యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ బుధవారం రాత్రి బరేలీలోని మౌలానా తౌకీర్ రజా ఇంటికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యుల్ని కలిశారు. మౌలానా తౌకీర్ రజా కుటుంబంతో భేటీ అయిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. గతేడాది బరేలీ అల్లర్ల కేసులో రజా కీలక నిందితుడి ఉన్నారు, ప్రస్తుతం జైలులో ఉన్నారు.

అజయ్ రాయ్ రజా ఇంటికి వెళ్లడాన్ని చాలా మంది రాజకీయ కోణంలో చూస్తున్నారు. రజా కుమారుడు ఫర్మాన్ రజాను, ఆయన కుటుంబ సభ్యుల్ని కలుసుకుని యోగక్షేమాలు అడిగారు. ఆయన కుటుంబంతో 45 నిమిషాలు మాట్లాడిన తర్వాత రాజధాని లక్నోకు చేరుకున్నారు. ఈ భేటీ నేపథ్యంలో కాంగ్రెస్ ముస్లిం ఓటర్లను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తౌకీర్ రజా కుటుంబంతో భేటీ అయిత తర్వాత అజయ్ రాయ్ యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై విమర్శలు చేశారు. చట్టబద్ధమైన పాలన కేవలం బలహీనులు, గళం విప్పేవారికేనా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య గళాలను అణిచివేయడానికి, అసమ్మతిని అణగదొక్కడానికి అధికార వర్గం ప్రదర్శించే అహంకారం ప్రజాస్వాయ్య వ్యవస్థకు తీవ్ర ఆందోళన కలిగించే విషమయని అన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sorakaya Sarvapindi: టేస్టీతో పాటు సూపర్ హెల్తీ.. ఘుమఘుమలాడే ‘సొరకాయ సర్వపిండి’ తింటే ఎన్ని లాభాల్లో తెలుసా?Mandadi : 100 కోట్ల క్లబ్‌లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com