☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Mandadi : 100 కోట్ల క్లబ్‌లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్, కోలీవుడ్ వెర్సటైల్ నటుడు సూరిల కలయికలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద ఊహించని సంచలనాలు సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై యావత్ సౌత్ ఇండియాను షేక్ చేసిన ఈ చిత్రం, ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లో సగర్వంగా అడుగుపెట్టి ట్రేడ్ వర్గాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కంటెంట్ లో దమ్ముంటే కలెక్షన్ల సునామీ సృష్టించవచ్చని నిరూపించిన ఈ చిత్రాన్ని చూసి ఇప్పుడు ఇండియన్ సినిమా […]
Mandadi : 100 కోట్ల క్లబ్‌లో సుహాస్-సూరిల ‘మండాడి’.. ప్రత్యేకంగా అభినందించిన కమల్

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్, కోలీవుడ్ వెర్సటైల్ నటుడు సూరిల కలయికలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘మండాడి’ బాక్సాఫీస్ వద్ద ఊహించని సంచలనాలు సృష్టిస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై యావత్ సౌత్ ఇండియాను షేక్ చేసిన ఈ చిత్రం, ఏకంగా రూ.100 కోట్ల క్లబ్‌లో సగర్వంగా అడుగుపెట్టి ట్రేడ్ వర్గాలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కంటెంట్ లో దమ్ముంటే కలెక్షన్ల సునామీ సృష్టించవచ్చని నిరూపించిన ఈ చిత్రాన్ని చూసి ఇప్పుడు ఇండియన్ సినిమా లెజెండ్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు.

బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన ‘మండాడి’ టీమ్‌కు ఇప్పుడు సాక్షాత్తూ దిగ్గజ నటుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా అభినందించగా.. తాజాగా ‘లోకనాయకుడు’ కమల్ హాసన్ సైతం ‘మండాడి’ టీమ్‌ను స్వయంగా పిలిపించుకుని మరీ సత్కరించడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సక్సెస్ ఫుల్ టీమ్‌ను కమల్ ప్రత్యేకంగా కలిసి, వారితో ముచ్చటించారు. సుహాస్, సూరి, రవీంద్ర విజయ్ ల నటనను, దర్శకుడు మతిమారన్ పుగళేంది టేకింగ్ ను కమల్ హాసన్ ఎంతో గొప్పగా ప్రశంసిస్తూ తన బెస్ట్ విషెస్ తెలియజేశారు.

కమల్ హాసన్ లాంటి లెజెండ్ నుంచి ప్రశంసలు దక్కడంతో హీరో సూరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన సోషల్ మీడియా వేదికగా ఆయన ఎమోషనల్ అవుతూ.. “ఇది నా జీవితంలో మర్చిపోలేని రోజు. మా ‘మండాడి’ టీంపై డా. కమల్ హాసన్ సర్ కురిపించిన ప్రేమ, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు, చెప్పిన మాటలు మాకు ఎంతో ప్రత్యేకం. ఈ అవకాశం కల్పించిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు” అని పోస్ట్ చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Uttar Pradesh: బరేలీ అల్లర్ల నిందితుడి ఇంటికి కాంగ్రెస్ అధ్యక్షుడు.. ముస్లిం ఓట్లే టార్గెట్.!Harish Rao : హరీశ్ వర్సెస్ కాంగ్రెస్.. ఇక కోర్టులోనే.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com