☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:

‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్‌లో హింస (Violence) ఎక్కువగా ఉందన్న విలేకరుల ప్రశ్నలపై విజయ్ దేవరకొండ స్పష్టతనిచ్చారు. ఇది కల్పిత హింస కాదని, ఆనాటి మొరటు కాలపు జీవన వాస్తవికతను ప్రతిబింబించే ప్రయత్నమని తెలిపారు. “1800ల నాటి కాలంలో జీవించడం అంటేనే చావో-బ్రతుకో అన్నట్టు ఉండేది. ఏ చిన్న గొడవైనా ప్రాణాల మీదకే వచ్చేది. ఆ కాలంలో మనుషులు అంత క్రూరంగా, మొరటుగా ప్రవర్తించేవారు. చరిత్రలో ఆకలి తట్టుకోలేక ప్రజలు నల్లమట్టి, […]
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:

‘రణబాలి’ సినిమా ప్రమోషన్లలో భాగంగా హీరో విజయ్ దేవరకొండ ట్రైలర్‌లో హింస (Violence) ఎక్కువగా ఉందన్న విలేకరుల ప్రశ్నలపై విజయ్ దేవరకొండ స్పష్టతనిచ్చారు. ఇది కల్పిత హింస కాదని, ఆనాటి మొరటు కాలపు జీవన వాస్తవికతను ప్రతిబింబించే ప్రయత్నమని తెలిపారు.
“1800ల నాటి కాలంలో జీవించడం అంటేనే చావో-బ్రతుకో అన్నట్టు ఉండేది. ఏ చిన్న గొడవైనా ప్రాణాల మీదకే వచ్చేది. ఆ కాలంలో మనుషులు అంత క్రూరంగా, మొరటుగా ప్రవర్తించేవారు. చరిత్రలో ఆకలి తట్టుకోలేక ప్రజలు నల్లమట్టి, చెట్ల బెరళ్ళు, చీమల పుట్టల్లోని గింజలను తిన్న పరిస్థితులు ఉన్నాయి. చివరకు మనుషులను చంపి తినే స్థాయికి (Cannibalism) కూడా వెళ్లారు.

అలాంటి తీవ్రమైన వాస్తవాలతో పోలిస్తే, సినిమాలో మేము చూపించింది చాలా తక్కువే” అని విజయ్ వివరించారు. కేవలం వినోదం కోసమే కాకుండా, మన పూర్వీకులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారో సహజంగా చూపించడానికే ఈ సినిమాలో రా అండ్ రస్టిక్ యాక్షన్‌ను చూపించినట్లు వెల్లడించారు. విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ నెల 16న విజయదశమి పర్వదినం సందర్భంగా “రణబాలి” సినిమా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.!Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com