☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Tragedy | గణేశ్‌ శోభాయాత్రలో చిక్కుకున్న అంబులెన్స్‌.. ఆస్పత్రికి చేరేసరికే రెండేళ్ల బాలుడి మృతి

Tragedy | గణేశ్‌ శోభాయాత్ర సందర్భంగా ఏర్పడిన ట్రాఫిక్‌ జామ్‌లో అంబులెన్స్‌ చిక్కుకోవడంతో ఓ రెండేళ్ల బాలుడి ప్రాణం పోయింది. ఈ విషాద ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది.
Tragedy | గణేశ్‌ శోభాయాత్రలో చిక్కుకున్న అంబులెన్స్‌.. ఆస్పత్రికి చేరేసరికే రెండేళ్ల బాలుడి మృతి

Tragedy | గణేశ్‌ శోభాయాత్ర సందర్భంగా ఏర్పడిన ట్రాఫిక్‌ జామ్‌లో అంబులెన్స్‌ చిక్కుకోవడంతో ఓ రెండేళ్ల బాలుడి ప్రాణం పోయింది. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న చిన్నారిని అత్యవసరంగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో వాహనం ముందుకు కదలకపోవడంతో.. తండ్రి తన కుమారుడిని భుజాలపై మోసుకుంటూ ఆస్పత్రికి పరుగులు తీశాడు. అయితే అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషాద ఘటన ఖమ్మం నగరంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా బోనకల్‌ ఎస్టీ కాలనీకి చెందిన భూక్యా సైదులు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు వైభవ్‌ నాయక్‌ (2) నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. తొలుత బాలుడిని ఏపీలోని ఎన్టీఆర్‌ జిల్లా వత్సవాయి ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఖమ్మం నగరంలోని పాతబస్టాండ్‌ సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకొచ్చారు. అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో బాలుడిని మరో ఆస్పత్రికి తరలించాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని జెడ్పీ సెంటర్‌ సమీపంలోని ఆస్పత్రికి అంబులెన్స్‌లో బయలుదేరారు.

అంబులెన్స్‌ ముందుకు వెళ్తున్న సమయంలో అదే మార్గంలో గణేశ్‌ శోభాయాత్ర సాగుతోంది. దీంతో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అత్యవసర పరిస్థితిలో ఉన్న బాలుడిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌ కూడా రద్దీలో చిక్కుకుపోయింది. సమయం గడిచిపోతుండటంతో ఆందోళనకు గురైన తండ్రి సైదులు.. అంబులెన్స్‌ నుంచి కుమారుడిని బయటకు తీసి భుజాలపై మోసుకుంటూ ఆస్పత్రి వైపు పరుగులు తీశాడు. అయినప్పటికీ బాలుడి పరిస్థితి అప్పటికే విషమించినట్లు తెలుస్తోంది.

ఆస్పత్రికి చేరుకున్న వెంటనే వైద్యులు బాలుడికి పరీక్షలు నిర్వహించారు. అయితే అప్పటికే వైభవ్‌ మృతిచెందినట్లు నిర్ధారించారు. దీంతో తమ కుమారుడిని సకాలంలో ఆస్పత్రికి తీసుకెళ్లగలిగితే బతికేవాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← నీట్ పీజీ ఫలితాలు విడుదలArikapudi Gandhi | ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి ఈడీ సమన్లు.. సెప్టెంబర్‌ 27న హాజరు కావాలని ఆదేశం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com