అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో కంది పంట ధ్వంసం ఘటన కలకలం రేపింది. గ్రామ సర్పంచ్ మడకం నాగేశ్వరరావుకు చెందిన పట్టా పొలంలో నాలుగు ఎకరాల కంది పంటను అటవీశాఖ సిబ్బంది ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆరోపించారు. కంది పంట ధ్వంసం ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు రామన్నగూడెం గ్రామస్తులు పోలీస్ స్టేషన్కు భారీగా తరలివెళ్లారు.
మూడు ట్రాక్టర్లలో సుమారు 200 మంది గిరిజనులు అశ్వారావుపేట పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పంట ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టా భూమిలో సాగు చేసిన కంది పంటను ధ్వంసం చేశారంటూ అటవీశాఖ సిబ్బందిపై గ్రామస్తుల ఆరోపణలు చేశారు. నాలుగు ఎకరాల కంది పంట ధ్వంసంతో తమకు నష్టం జరిగిందని, ఈ ఘటనపై విచారణ జరిపి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.


