☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Asian Games: అనాహ‌త్ సింగ్ స్ట‌న్నింగ్ షో.. స్క్వాష్ ఫైన‌ల్లోకి భార‌త క్రీడాకారిణి

Asian Games: స్క్వాష్ క్రీడాకారిణి అనాహ‌త్ సింగ్‌.. త‌న కెరీర్‌లోనే అత్య‌ద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఏషియ‌న్ గేమ్స్‌లో మ‌హిళ‌ల సింగిల్స్ ఈవెంట్‌లో ఆమె ఫైన‌ల్‌కు ప్ర‌వేశించింది. సెమీస్‌లో జ‌పాన్‌కు చెందిన ఆరో నెంబ‌ర్ ప్లేయ‌ర్ స‌టోమి వాటాన‌బేపై 3-2 తేడాతో విక్ట‌రీ కొట్టింది.
Asian Games: అనాహ‌త్ సింగ్ స్ట‌న్నింగ్ షో.. స్క్వాష్ ఫైన‌ల్లోకి భార‌త క్రీడాకారిణి

న‌గోయా: భార‌త యువ ప్లేయ‌ర్, స్క్వాష్ క్రీడాకారిణి అనాహ‌త్ సింగ్‌.. త‌న కెరీర్‌లో అత్య‌ద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఏషియ‌న్ గేమ్స్‌(Asian Games)లో మ‌హిళ‌ల సింగిల్స్ ఈవెంట్‌లో ఆమె ఫైన‌ల్‌కు ప్ర‌వేశించింది. సెమీస్‌లో జ‌పాన్‌కు చెందిన ఆరో నెంబ‌ర్ ప్లేయ‌ర్ స‌టోమి వాటాన‌బేపై 3-2 తేడాతో విక్ట‌రీ కొట్టింది. 18 ఏళ్ల భార‌త ప్లేయ‌ర్ అనాహ‌త్ .. అసాధార‌ణ రీతిలో త‌న గేమ్‌ను ఆడింది. తొలుత రెండు సెట్ల‌ను కోల్పోయి 2-0 తేడాతో వెనుక‌బ‌డ్డ అనాహ‌త్‌.. ఆ త‌ర్వాత అనూహ్యంగా కోలుకున్న‌ది. ఏకంగా చివ‌రి మూడు సెట్ల‌లో విజ‌యం సాధించి .. ఏషియ‌న్ గేమ్స్‌లో త‌నకు ప‌త‌కాన్ని ఖాయం చేసుకున్న‌ది. అనాహ‌త్ 9-11 11-13 12-10 11-6 11-3 స్కోరుతో ప్ర‌త్య‌ర్థిపై గెలిచింది.

ఇక భార‌త జోడి జోష్నా చిన్న‌ప్ప‌, విలావ‌న్ సెంథిల్ కుమార్‌.. బ్రాంజ్ మెడ‌ల్ గెలుచుకున్నారు. హాంగ్‌కాంగ్‌కు చెందిన టాంగ్ మింగ్ హాంగ్‌, లీ కా యి చేతిలో 2-1 (11-10 2-11 11-10) తేడా స్కోరుతో భార‌త జోడి ఓట‌మి పాలైంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Megastar Chiranjeevi | తాతయ్య, నానమ్మల ప్రతిభే జేస‌న్‌కు వ‌చ్చింది.. ‘సిగ్మా’ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి!NarayaNamma | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ నుంచి ఫస్ట్ సింగిల్‌కు కొత్త డేట్.. రేపే ‘నారాయణమ్మ’ సందడి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com