☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Megastar Chiranjeevi | తాతయ్య, నానమ్మల ప్రతిభే జేస‌న్‌కు వ‌చ్చింది.. ‘సిగ్మా’ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి!

Jason Sanjay | త‌మిళ‌నాడు సీఎం, కోలీవుడ్ దళపతి విజయ్ వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న జేసన్ సంజయ్, అందరిలాగా కెమెరా ముందుకొచ్చి హీరో కాకుండా, కెమెరా వెనుక నిలబడి మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన రీతిలో విశ్లేషించారు.
Megastar Chiranjeevi | తాతయ్య, నానమ్మల ప్రతిభే జేస‌న్‌కు వ‌చ్చింది.. ‘సిగ్మా’ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి!

Chiranjeevi | త‌మిళ‌నాడు సీఎం, కోలీవుడ్ దళపతి విజయ్ వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్న జేసన్ సంజయ్, అందరిలాగా కెమెరా ముందుకొచ్చి హీరో కాకుండా, కెమెరా వెనుక నిలబడి మెగాఫోన్ పట్టి దర్శకుడిగా మారడం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికరమైన రీతిలో విశ్లేషించారు. యంగ్ హీరో సందీప్ కిషన్ కథానాయకుడిగా, జేసన్ సంజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సిగ్మా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా విచ్చేసిన చిరంజీవి, విజయ్ కుటుంబంతో తనకు ఉన్న దశాబ్దాల అనుబంధాన్ని నెమరువేసుకుంటూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

జేస‌న్‌ను మొదటగా కలిసినప్పుడు 1993-95 సమయంలో మీ నాన్న విజయ్ ఎలా ఉండేవాడో అచ్చు గుద్దినట్లు నువ్వు అలాగే ఉన్నావు, మరి నటన వైపు రాకుండా దర్శకత్వాన్ని ఎందుకు ఎంచుకున్నావు? అని నేరుగా ప్రశ్నించానని, దానికి జాసన్ తనకు కథలు రాయడం, దర్శకత్వం వహించడమే ఇష్టమని బదులిచ్చారని తెలిపారు. ఈ సమాధానంతో జేసన్‌కు తండ్రి విజయ్ యాక్టింగ్ జీన్స్ కంటే కూడా, ఆయన తాతయ్య ప్రముఖ దర్శకుడు ఎస్.ఏ. చంద్రశేఖర్, నానమ్మ శోభల దర్శకత్వ, రచనా పటిమల జీన్స్ వంశపారపర్యంగా వచ్చాయని తనకు స్పష్టంగా అర్థమైందని చిరంజీవి వెల్లడించారు. తన కెరీర్‌లో నిలిచిపోయిన ‘చట్టానికి కళ్ళు లేవు’, ‘దేవాంతకుడు’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తే, శోభ గారు ఆ కథలను అందించారని, నేడు మూడో తరం కుర్రాడైన జేసన్ సరిగ్గా వారి బాటలోనే పయనిస్తూ ఆ కళాత్మక లక్షణాలను పుణికిపుచ్చుకోవడం అభినందనీయమని కొనియాడారు.

ఎస్.ఏ. చంద్రశేఖర్ కుటుంబంతో తనకు మూడు తరాల ప్రత్యేక బంధం ఉందని, ఆయన దర్శకత్వంలో తాను సినిమాలు చేయడమే కాకుండా, విజయ్ సినీ ప్రస్థానం ప్రారంభమైన తొలినాళ్లలో ఒక చిత్రం ముహూర్తపు షాట్‌కు సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో కలిసి తాను క్లాప్ కొట్టానని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆ గొప్ప కుటుంబంపై ఉన్న అమితమైన గౌరవంతో పాటు, హీరో సందీప్ కిషన్‌పై ఉన్న అభిమానంతోనే ‘సిగ్మా’ చిత్ర వేడుకకు సంతోషంగా హాజరయ్యానని చెప్పారు. తాత ఎస్.ఏ. చంద్రశేఖర్ దర్శకుడిగా, తండ్రి విజయ్ అగ్ర కథానాయకుడిగా ఇండియన్ సినిమాలో తమకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నట్లే, జేసన్ సంజయ్ కూడా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకుని దర్శకుడిగా శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటారని ఆశీర్వదించారు. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సిగ్మా’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధిస్తుందని చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Premanand Maharaj | ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మ‌హారాజ్ శిష్యుడు ఆత్మ‌హ‌త్య‌.. బిల్డింగ్ పైనుంచి దూకిAsian Games: అనాహ‌త్ సింగ్ స్ట‌న్నింగ్ షో.. స్క్వాష్ ఫైన‌ల్లోకి భార‌త క్రీడాకారిణి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com