☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Premanand Maharaj | ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మ‌హారాజ్ శిష్యుడు ఆత్మ‌హ‌త్య‌.. బిల్డింగ్ పైనుంచి దూకి

Premanand Maharaj : ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మ‌హారాజ్ శిష్యుడు దీప‌క్ కుమార్ అలియాస్ ర‌సిక్ దులారి శ‌ర‌ణ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఆశ్ర‌మం బిల్డింగ్ నాలుగో అంత‌స్తు పై నుంచి దూకి శుక్ర‌వారం దీప‌క్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది.
Premanand Maharaj | ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మ‌హారాజ్ శిష్యుడు ఆత్మ‌హ‌త్య‌.. బిల్డింగ్ పైనుంచి దూకి

Premanand Maharaj : ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మ‌హారాజ్ శిష్యుడు దీప‌క్ కుమార్ అలియాస్ ర‌సిక్ దులారి శ‌ర‌ణ్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఉత్త‌ర ప్ర‌దేశ్‌, మ‌ధుర ప‌రిధి, వృందావ‌న్‌లోని ఆశ్ర‌మం బిల్డింగ్ నాలుగో అంత‌స్తు పై నుంచి దూకి శుక్ర‌వారం దీప‌క్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డ‌ట్లు తెలుస్తోంది. బిల్డింగ్‌పై నుంచి దూకిన అత‌డిని సన్నిహితులు వెంట‌నే స్థానిక స‌ర్వోద‌య ఆస్ప‌త్రికి చికిత్స కోసం త‌ర‌లించారు. అప్ప‌టికే అత‌డి ప‌రిస్థితి విష‌మంగా ఉంది.

దీంతో ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ దీప‌క్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘ‌ట‌న గురించి ఆశ్ర‌మ నిర్వాహ‌కులు వృందావ‌న్ కొట్వాలి పోలీస్ స్టేష‌న్‌కు స‌మాచారం అందించారు. ఈ ఘ‌ట‌న గురించి స్థానిక ఎస్పీ విజ‌య్ కుమార్ కూడా ఆరా తీశారు. ఆయ‌న తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. దీప‌క్ అలియాస్ రసిక్ దులారి శ‌ర‌ణ్.. జ‌బ‌ల్‌పూర్ నుంచి వ‌చ్చి, ఆశ్ర‌మంలో ఉంటున్నాడు. గ‌త ఏడాది ఫిబ్ర‌వ‌రి నుంచి ప్రేమానంద్ మ‌హారాజ్ ఆశీస్సుల‌తో, ఆయ‌న శిష్యుల‌లో ఒక‌డిగా కొన‌సాగుతున్నాడు. ఏడాదిన్న‌ర కాలంగా ఆశ్ర‌మం ద‌గ్గ‌ర‌లో ఉన్న సొసైటీ బిల్డింగ్‌లోని ఒక ఫ్లాట్‌లో ఉంటున్నాడు.

అయితే, అత‌డు ఆత్మ‌హ‌త్య చేసుకునేందుకు గ‌ల కార‌ణాల‌పై స్ప‌ష్టత లేదు. ఎందుకు దీప‌క్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు అనే విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆశ్ర‌మ నిర్వాహ‌కుల‌తోపాటు సిబ్బందిని పోలీసులు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌తో ఆశ్ర‌మంలో విషాధ ఛాయ‌లు అలుముకున్నాయి. ఈ ఘ‌ట‌న‌పై అటు ప్రేమానంద్ మ‌హారాజ్ కానీ, ఇటు ఆశ్ర‌మ నిర్వాహ‌కులు కానీ ఎలాంటి ప్ర‌క‌ట‌నా చేయ‌లేదు. దీప‌క్ మృతిపై అన్ని కోణాల్లో ద‌ర్యాప్తు జ‌రుపుతున్నామ‌ని పోలీసులు తెలిపారు. విచార‌ణ అనంత‌రం త‌గిన వివ‌రాలు వెల్ల‌డిస్తామ‌న్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Squats | మోకాళ్ల నొప్పులు వ‌స్తున్నాయ‌ని స్క్వాట్స్ వ్యాయామాన్ని ఆపేస్తున్నారా.. అయితే ఇలా చేయండి..Megastar Chiranjeevi | తాతయ్య, నానమ్మల ప్రతిభే జేస‌న్‌కు వ‌చ్చింది.. ‘సిగ్మా’ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com