☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

AP Government: ఏపీ భవన యజమానులకు గుడ్ న్యూస్.. మున్సిపల్ నిబంధనల్లో భారీ మార్పులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఏపీలో భవనాలకు(AP Government) ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ, తనఖా ఆస్తుల విడుదల ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది.
AP Government: ఏపీ భవన యజమానులకు గుడ్ న్యూస్.. మున్సిపల్ నిబంధనల్లో భారీ మార్పులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!

AP Government: ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో భవనాలు నిర్మించే యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మున్సిపాలిటీల పరిధిలో భవన నిర్మాణం పూర్తయిన తర్వాత పొందాల్సిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (AP Government) జారీ ప్రక్రియను మరింత సరళీకృతం చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజలకు పారదర్శకంగా, వేగవంతంగా మున్సిపల్ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది.

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్.. 3 రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక!

తనఖా ఆస్తుల విడుదల ఆన్‌లైన్‌లోకి.. సులభంగా సేవలు:

భవన నిర్మాణ అనుమతుల సమయంలో స్థానిక సంస్థల వద్ద తనఖా పెట్టిన 10 శాతం ఆస్తుల విడుదల ప్రక్రియలో కూడా ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని డిజిటలైజ్ చేస్తూ, పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహించేలా చర్యలు చేపట్టింది. దీనివల్ల భవన యజమానులు కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చాలా సులభంగా, వేగంగా తమ తనఖా ఆస్తులను విడిపించుకోవడానికి మార్గం సుగమమైంది.

పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ:

ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం భవన యజమానులపై నిబంధనల భారం తగ్గి, వేధింపులు లేని సేవలు అందుతాయని అధికారులు తెలిపారు. ఈ సంస్కరణల ద్వారా పట్టణ ప్రాంతాల్లో భవన నిర్మాణ రంగం మరింత పుంజుకోవడమే కాకుండా, ప్రజలకు సకాలంలో అనుమతులు లభిస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

⬇ Full News JPG⬇ Short News JPG
← Mithun Reddy: పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి.. చంద్రబాబు, లోకేష్‌లపై తీవ్ర ఆరోపణలు.. వైకాపా వర్గాల్లో తీవ్ర కలకలం!Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్.. 3 రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com