☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్.. 3 రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక!

ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడ్రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rain Aler)కురిసే అవకాశముంది.
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ రెయిన్ అలర్ట్.. 3 రోజుల పాటు భారీ వర్షాలు.. వాతావరణశాఖ తీవ్ర హెచ్చరిక!

Heavy Rain Alert: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనాలు, బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సముద్ర మట్టానికి 1.5 నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ వాతావరణ మార్పులు విస్తరించి ఉన్నాయని అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు స్పష్టం చేశాయి. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Chandrababu Naidu: దుర్గమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు దంపతులు.. వేదాశీర్వచనం అందించిన పండితులు!

ఆంధ్రప్రదేశ్‌లో జోరుగా వర్షాలు.. ఈదురు గాలుల ముప్పు:

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులు భారీ నుండి అతిభారీ వర్షాలు(Heavy Rain Alert) కురిసే అవకాశముంది. వర్షంతో పాటు గంటకు 40 నుండి గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని, గాలివాన తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

తెలంగాణకూ రెయిన్ అలర్ట్.. పిడుగులు పడే ప్రమాదం:

ఇక తెలంగాణలోని పలు జిల్లాలకు కూడా వాతావరణశాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద గానీ, విద్యుత్ స్తంభాల వద్ద గానీ నిలబడవద్దని సూచించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← AP Government: ఏపీ భవన యజమానులకు గుడ్ న్యూస్.. మున్సిపల్ నిబంధనల్లో భారీ మార్పులు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!Nandamuri Deepika : మూలానక్షత్రం స్పెషల్.. వీణతో ఎన్టీఆర్ వదినమ్మ స్పెషల్ ఫొటోలు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com