☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు కూటమి సర్కార్..!

AP Local Body Elections : ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు కూటమి సర్కార్..!

AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై గురువారం హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. అయితే, బీసీలకు 34శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు డిస్మిస్ చేసింది. 105, 1065 జీఓలు రెండింటిని కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా జీఓలు ఇచ్చారని న్యాయస్థానం పేర్కొంది. మొత్తం రిజర్వేషన్లు 50శాతం దాటకూడదని పేర్కొంది. అయితే, బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు తీరుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఏపీ సర్కార్ నిర్ణయించింది.

Also Read : Ration Card Alert : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే కార్డు రద్దయ్యే చాన్స్! అక్టోబర్ నుంచి కొత్త విధానం

టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. బీసీల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని, బీసీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని అన్నారు. అట్టడుగున ఉన్న బీసీలను ముందుకు తీసుకురావడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. బీసీలు అత్యంత ఉన్నత స్థానంలో ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నామని, బీసీలు బానిసలుగా ఉండాలన్నదే వైఎస్ఆర్ సీపీ నేతల కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ తేవాలన్న సంకల్పంతో ఉన్నామని, వైసీపీ కుట్ర రాజకీయాలను అందరూ ఖండించాలని ఎంపీ చింతకాయల విజయ్ పేర్కొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← AP Government : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు గుడ్‌న్యూస్India vs Sri Lanka : ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్.. శ్రీలంక బౌలర్లను ఆడుకున్న వైభవ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com