☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

India vs Sri Lanka : ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్.. శ్రీలంక బౌలర్లను ఆడుకున్న వైభవ్

India vs Sri Lanka Asian Games Semi Final : ఏసియన్ గేమ్స్ 2026లో భాగంగా పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత బ్యాటర్లు అదరగొట్టారు.
India vs Sri Lanka : ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్.. శ్రీలంక బౌలర్లను ఆడుకున్న వైభవ్

India vs Sri Lanka Asian Games Semi Final : ఏసియన్ గేమ్స్ 2026లో భాగంగా పురుషుల క్రికెట్ సెమీఫైనల్లో భారత బ్యాటర్లు అదరగొట్టారు. గురువారం ఉదయం ఇండియా వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య సెమీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత ఇండియా బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. భారత బ్యాటర్లు ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ అద్భుత ఇన్నింగ్స్ ఆడారు.

Also Read : IND vs WI : మేము ఆ పెద్ద‌తప్పు చేశాం.. అందుకే ఓడిపోయాం.. వెస్టిండీస్ కెప్టెన్ షైయ్ హోప్ కీలక కామెంట్స్

ఇషాన్ కిషన్ విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. 46 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సులు ఉన్నాయి. తొలుత భారత స్కోర్ బోర్డు నెమ్మదిగా కొనసాగింది. దీనికితోడు వెంటవెంటనే వికెట్లు పడటంతో 150 పరుగులు దాటడం కష్టమనే పరిస్థితి ఏర్పడింది. చివరి ఓవర్లలో ఇషాన్ కిషన్ దుకుడుగా ఆడటంతో భారత్ స్కోర్ 160 పరుగుల మార్కును దాటగలిగింది.

భారత జట్టు ఆరంభంలో వరుస వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లలో అభిషేక్ శర్మ (3 బంతుల్లో 7) వచ్చీరాగానే పెవిలియన్ చేరగా.. వన్ డౌన్లో వచ్చిన సంజూ శాంసన్ (తొమ్మిది బంతుల్లో ఏడు పరుగులు) కూడా విఫలమయ్యాడు. మరో ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. అయితే, మొత్తం 21 బంతులు ఎదుర్కొన్న సూర్యవంశీ.. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 38 పరుగులు చేసి ఔట్ అయ్యాడు.

మిగిలిన వారిలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (13 పరుగులు), అక్షర్ పటేల్ (8పరుగులు), వైస్ కెప్టెన్ తిలక్ వర్మ (రెండు పరుగులు), శివం దూబే (మూడు పరుగులు) వరుసగా పెవిలియన్ బాటపట్టారు. వికెట్లు వరుసగా పడుతున్నా మరోవైపు.. ఐదో నెంబర్ బ్యాటర్ గా క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ మాత్రం ఫోర్లు, సిక్సర్లతో విధ్వంసకర బ్యాటింగ్ చేశాడు. వాషింగ్టన్‌ సుందర్‌ (3 బంతుల్లో 7 నాటౌట్‌) తోడుగా నిలిచాడు. ఫలితంగా భారత్ స్కోర్ నిర్ణీత 20 ఓవర్లలో 169 పరుగులకు చేరింది. ఫైనల్ బెర్త్ కోసం శ్రీలంక 170 పరుగులు చేయాల్సి ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు కూటమి సర్కార్..!AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు.. 34శాతం బీసీ రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com