☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు.. 34శాతం బీసీ రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు!

AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.
AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక తీర్పు.. 34శాతం బీసీ రిజర్వేషన్లపై కీలక ఆదేశాలు!

AP Local Body Elections : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లోగా ప్రారంభించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. మరోవైపు.. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టు డిస్మిస్ చేసింది. 105, 1065 జీఓలు రెండింటిని కొట్టివేసింది. సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా జీఓలు ఇచ్చారని న్యాయస్థానం పేర్కొంది. మరోవైపు.. సర్ ప్రక్రియ ముగిశాకే ఎన్నికలు జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. హైకోర్టు తాజా తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయినట్లు కనిపిస్తోంది. ఆరు వారాల్లో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Also Read : Ration Card Alert : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే కార్డు రద్దయ్యే చాన్స్! అక్టోబర్ నుంచి కొత్త విధానం

ఇదిలా ఉంటే.. బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు తీరుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ఏపీ సర్కార్ నిర్ణయించింది. టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ మాట్లాడుతూ.. బీసీలకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పారు. బీసీల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని, బీసీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తోందని అన్నారు.

అట్టడుగున ఉన్న బీసీలను ముందుకు తీసుకురావడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని విజయ్ పేర్కొన్నారు. బీసీలు అత్యంత ఉన్నత స్థానంలో ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నామని, బీసీలు బానిసలుగా ఉండాలన్నదే వైఎస్ఆర్ సీపీ నేతల కుట్ర అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 34శాతం రిజర్వేషన్ తేవాలన్న సంకల్పంతో ఉన్నామని, వైసీపీ కుట్ర రాజకీయాలను అందరూ ఖండించాలని ఎంపీ చింతకాయల విజయ్ పేర్కొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← India vs Sri Lanka : ఇషాన్ కిషన్ విధ్వంసకర ఇన్నింగ్స్.. శ్రీలంక బౌలర్లను ఆడుకున్న వైభవ్Ration Card Alert : రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయండి.. లేదంటే కార్డు రద్దయ్యే చాన్స్! అక్టోబర్ నుంచి కొత్త విధానం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com