☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) సిద్ధమవుతోంది. మిగిలిన 41 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్, ఓటర్ల జాబితాల ప్రక్రియను పూర్తి చేసే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. 41 యూఎల్‌బీలకు సంబంధించిన వార్డు వారీ ఓటర్ల జాబితాల ప్రక్రియ ఇప్పటికే చేపట్టారు. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలకు సంబంధించిన అంశాలపై ఏపీ […]
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.!

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (APSEC) సిద్ధమవుతోంది. మిగిలిన 41 పట్టణ స్థానిక సంస్థల్లో డీలిమిటేషన్, ఓటర్ల జాబితాల ప్రక్రియను పూర్తి చేసే దిశగా అధికారులు ముందుకు సాగుతున్నారు. 41 యూఎల్‌బీలకు సంబంధించిన వార్డు వారీ ఓటర్ల జాబితాల ప్రక్రియ ఇప్పటికే చేపట్టారు.

అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. రిజర్వేషన్లు, ఓటర్ల జాబితాలకు సంబంధించిన అంశాలపై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తై తీర్పు రిజర్వ్ అయింది. తీర్పు వెలువడిన తర్వాత ఎన్నికల ప్రక్రియపై తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు అధికారులు.

మరోవైపు ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులను మున్సిపల్, పంచాయతీరాజ్ అధికారులు ఇప్పటికే సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే అదనపు బ్యాలెట్ బాక్సులను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి కూడా తీసుకునే ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. మున్సిపల్ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికలను కూడా రెండు విడతల్లో నిర్వహించేందుకు ఎస్ఈసీ ఏర్పాట్లు చేస్తోంది.

ప్రస్తుతం డీలిమిటేషన్, ఓటర్ల జాబితాలు, రిజర్వేషన్ల ప్రక్రియలపై దృష్టి సారించిన అధికారులు.. హైకోర్టు తీర్పు తర్వాత ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి చర్యలను వేగవంతం చేయనున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్‌పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్‌ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్‌ మెడల్‌ కైవసం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com