☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్‌పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..

Kanyakumari YouTuber House Robbery: తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ యూట్యూబర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఏకంగా 118 సవర్ల బంగారం, దానికి తోడు పెద్ద మొత్తంలో నగదు మాయమైపోయింది. దక్షిణ భారతదేశంలో బంగారం బరువును చెప్పడానికి 'సవర్' అనే పదాన్ని వాడతారన్న విషయం తెలిసిందే. ఒక సవర్ అంటే దాదాపు 8 గ్రాములతో సమానం. అంటే ఆ ఇంట్లో చోరీకి గురైన బంగారం ఏకంగా 944 గ్రాములు, అటూ ఇటూగా కేజీకి దగ్గరగా ఉందన్నమాట! వీటితో పాటు ఇంట్లోని క్యాష్‌ను కూడా దొంగలు పట్టుకుపోయారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. సోషల్ మీడియాలో సదరు యూట్యూబర్ చూపించిన హడావుడి, ప్రదర్శించిన సంపదే దొంగలకు దారి చూపిందా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్‌పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు..

Kanyakumari YouTuber House Robbery: తమిళనాడులోని కన్యాకుమారిలో ఓ యూట్యూబర్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఏకంగా 118 సవర్ల బంగారం, దానికి తోడు పెద్ద మొత్తంలో నగదు మాయమైపోయింది. దక్షిణ భారతదేశంలో బంగారం బరువును చెప్పడానికి ‘సవర్’ అనే పదాన్ని వాడతారన్న విషయం తెలిసిందే. ఒక సవర్ అంటే దాదాపు 8 గ్రాములతో సమానం. అంటే ఆ ఇంట్లో చోరీకి గురైన బంగారం ఏకంగా 944 గ్రాములు, అటూ ఇటూగా కేజీకి దగ్గరగా ఉందన్నమాట! వీటితో పాటు ఇంట్లోని క్యాష్‌ను కూడా దొంగలు పట్టుకుపోయారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. సోషల్ మీడియాలో సదరు యూట్యూబర్ చూపించిన హడావుడి, ప్రదర్శించిన సంపదే దొంగలకు దారి చూపిందా అనే కోణంలో ఇప్పుడు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ఈ ఘోరం కన్యాకుమారి జిల్లాలోని తమ్మాత్తుకోణం ప్రాంతంలో ఉన్న వీఐపీ గార్డెన్‌లో జరిగింది. అక్కడ వినోద్ కుమార్ అనే యూట్యూబర్ తన భార్య మధుమితతో కలిసి నివాసముంటున్నాడు. రాత్రి వేళ ఎవరూ లేని సమయం చూసి, గుర్తుతెలియని దుండగులు ఇంటి వెనుక తలుపులు బద్దలుగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లో దాచి ఉంచిన బంగారు నగలు, నగదును సర్దేసి అక్కడి నుంచి జారుకున్నారు. ఈ చోరీ అసలు ఏ టైమ్‌లో జరిగింది? ఎంతమంది దొంగలు వచ్చారు? వారు ఏ దారిలో వచ్చి ఎలా పరారయ్యారనే విషయాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఘటనపై సమాచారం అందగానే రాజాక్కమంగళం పోలీసులు వెంటనే రంగాంలోకి దిగారు. బాధితుడి ఇంటిని పరిశీలించి, చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. దొంగలు ఎక్కడైనా కెమెరాలకు చిక్కారా? అని ఆరా తీస్తున్నారు.

ఇక ఈ కేసుకు సంబంధించి బయటపడిన సోషల్ మీడియా యాంగిల్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ యూట్యూబర్ దంపతులు తమ సోషల్ మీడియా వీడియోల్లో తరచుగా భారీగా బంగారు నగలు, కట్టల కొద్దీ నగదును ప్రదర్శిస్తూ ఉండే వారని రిపోర్టులు చెప్తున్నాయి. దీంతో సోషల్ మీడియా వీడియోలను చూసే దొంగలు స్కెచ్ వేశారా? లేదా ఆ ఇంట్లో ఇంత పెద్ద మొత్తంలో విలువైన వస్తువులు ఉన్నాయని వారికి ముందే సమాచారం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. దొంగలు రాకముందే ఇల్లు, పరిసర ప్రాంతాలపై రేకీ నిర్వహించారా? లేక ఉన్నట్టుండి వచ్చి పడ్డారా అనే దిశగానూ దర్యాప్తు సాగుతోంది. వెనుక తలుపునే ఎందుకు ఎంచుకున్నారు, దొంగతనానికి ఏమైనా వాహనం వాడారా, చోరీ తర్వాత ఏ దిశగా పరారయ్యారనే అంశాలను సేకరిస్తున్నారు. సీసీటీవీ ఆధారాలు, ఘటనా స్థలంలో దొరికిన క్లూస్‌తో దొంగల మూలాలు లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ కేసులో ఎవరినీ గుర్తించలేదు, అరెస్టులు కూడా జరగలేదు, విచారణ వేగవంతంగా సాగుతోంది. ఇక్కడ విషయం కేవలం ఓ యూట్యూబర్ ఇంట్లో కేజీ బంగారం దొంగతనం జరిగిందనేది మాత్రమే కాదు! దొంగలకు ఇంట్లోని ఈ భారీ నిధి గురించి సమాచారం ఎలా తెలిసింది? వారు పక్కా ప్లాన్‌తో రేకీ చేసి వచ్చారా లేక సోషల్ మీడియాలో చూపించిన హంగామానే దొంగలను ఆకర్షించిందా? అనేవే అసలు ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నింటికీ పోలీసుల విచారణ పూర్తి అయి, సీసీటీవీ ఫుటేజీలు క్లియర్‌గా తేలితే గానీ సరైన సమాధానం దొరకదు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులుAP Local Body Elections: స్థానిక ఎన్నికలకు రెడీ.. తీర్పు కోసం ఎదురుచూపులు.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com