☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు

DU Student Harassment: ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థినిని కొందరు యువకులు వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. తన టీ-షర్ట్‌పై వ్యాఖ్యలు చేయడాన్ని ప్రశ్నించడంతో కారులో ఉన్న యువకులు అసభ్యంగా మాట్లాడారని, అనంతరం తనను, తన స్నేహితురాలిని కారుతో వెంబడించారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. బాధితురాలి వివరాల ప్రకారం.. రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఆమె తన స్నేహితురాలితో కలిసి హకీకత్ పార్క్ మోడ్ నుంచి ఓల్డ్ గుప్తా […]
DU Student Harassment: ‘అర్బన్ మైండ్‌సెట్’ టీ-షర్ట్‌పై కామెంట్స్. DU విద్యార్థినిని SUVతో వెంబడించిన యువకులు

DU Student Harassment: ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థినిని కొందరు యువకులు వేధించినట్లు ఆరోపణలు వచ్చాయి. తన టీ-షర్ట్‌పై వ్యాఖ్యలు చేయడాన్ని ప్రశ్నించడంతో కారులో ఉన్న యువకులు అసభ్యంగా మాట్లాడారని, అనంతరం తనను, తన స్నేహితురాలిని కారుతో వెంబడించారని విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. బాధితురాలి వివరాల ప్రకారం.. రాత్రి సుమారు 9:30 గంటల సమయంలో ఆమె తన స్నేహితురాలితో కలిసి హకీకత్ పార్క్ మోడ్ నుంచి ఓల్డ్ గుప్తా చౌక్ వైపు నడుచుకుంటూ వెళ్తోంది. అదే సమయంలో ఓ SUVలో వచ్చిన కొందరు యువకులు కారు అద్దం దించి ఆమెను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని ఆమె ఆరోపించింది. ఆ సమయంలో ఆమె ఎరుపు రంగు టీ-షర్ట్ ధరించగా, దానిపై ‘Urban Mindset’ అని రాసి ఉంది. ఆ టీ-షర్ట్‌ను ఉద్దేశించి ఓ యువకుడు వ్యాఖ్యానించాడని విద్యార్థిని తెలిపింది.

అభ్యంతరం చెప్పడంతో అసభ్య పదజాలం

తమపై వ్యాఖ్యలు చేయడాన్ని ఇద్దరు యువతులు వ్యతిరేకించి, మర్యాదగా ఉండాలని సూచించినట్లు బాధితురాలు తెలిపింది. దీంతో కారులో ఉన్న యువకులు మరింత దూకుడుగా వ్యవహరించి అసభ్య పదజాలంతో మాట్లాడారని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్పడంతో యువకులు బెదిరింపులకు పాల్పడ్డారని కూడా ఆమె పేర్కొంది. అనంతరం అక్కడి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించగా, SUVలో ఉన్న యువకులు తమను వెంబడించడం ప్రారంభించారని తెలిపింది.

చౌరస్తాలో కారు అడ్డంగా పెట్టారని ఆరోపణ

కొంతదూరం వెళ్లిన తర్వాత ఓ చౌరస్తా వద్ద యువకులు తమ కారును ఇద్దరు యువతుల ముందు ఆపారని బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. కారులో ఉన్నవారు అద్దాలు దించి మరోసారి దుర్భాషలాడారని ఆమె ఆరోపించింది. ఈ పరిణామంతో భయపడిన ఆమె తన మొబైల్‌ను బయటకు తీసి ఘటనను వీడియో రికార్డ్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపింది.

మొబైల్ కెమెరాను బయటకు తీసిన వెంటనే యువకులు కారును వేగంగా అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారని విద్యార్థిని తెలిపింది. అనంతరం ఆమె పోలీసులను ఆశ్రయించి ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Avengers Endgame Encore: బాహుబలి రికార్డు బద్దలు.. ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాలీవుడ్ మూవీ..!Tamil Nadu: బంగారం, డబ్బులు ఎక్స్‌పోజ్ చేస్తూ రీల్స్.. వీడియోలు చూసి కేజీ గోల్డ్, భారీగా డబ్బు కొట్టేసిన దొంగలు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com