☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Vijay Deverakonda : 'రణబాలి' రన్‌టైమ్‌పై రౌడీ స్టార్ క్లారిటీ.. ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ క్రేజీ రియాక్షన్!

Vijay Deverakonda : 'రణబాలి' రన్‌టైమ్‌పై రౌడీ స్టార్ క్లారిటీ.. ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ క్రేజీ రియాక్షన్!
Vijay Deverakonda : 'రణబాలి' రన్‌టైమ్‌పై రౌడీ స్టార్ క్లారిటీ.. ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ క్రేజీ రియాక్షన్!
Vijay Deverakonda : 'రణబాలి' రన్‌టైమ్‌పై రౌడీ స్టార్ క్లారిటీ.. ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ క్రేజీ రియాక్షన్!

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న మైండ్ బ్లోయింగ్ పీరియడ్ యాక్షన్ డ్రామా 'రణబాలి'. పెళ్లి తర్వాత ఈ జంట కలిసి నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నియి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి అజయ్-అతుల్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టి-సిరీస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ ట్రైలర్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు. 18వ శతాబ్దపు రాయలసీమ నేపథ్యంలో, నాటి కరువు, బ్రిటిష్ పాలనలోని అణచివేతను అత్యంత సహజసిద్ధంగా తెరకెక్కించారని ఆయన కొనియాడారు.

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తన మాస్ పెర్ఫార్మన్స్, ఫెయిర్స్ లుక్‌తో సీమ గడ్డపై 'రణబాలి'గా జీవించేశారని, రష్మిక తన నటనతో నెవ్వర్ బిఫోర్ అనదగ్గ రీతిలో ఆకట్టుకుందని ఎక్స్ (X) వేదికగా లోకేష్ అభినందించారు. చిత్రయూనిట్‌కు అక్టోబర్ 16న గ్రాండ్ సక్సెస్ లభించాలని విష్ చేశారు. మంత్రి లోకేష్ ప్రశంసలపై మైత్రి మూవీ మేకర్స్ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను ఖచ్చితంగా గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేసింది.

ఇక ఈ సినిమా రన్‌టైమ్‌పై రౌడీ హీరో విజయ్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. కథ విస్తృతి దృష్ట్యా 'రణబాలి' రఫ్ కట్ ఏకంగా 3 గంటల 20 నిమిషాలు వచ్చిందని, అయితే స్క్రీన్‌ప్లేను మరింత గ్రిప్పింగ్‌గా మార్చేందుకు ఎడిటింగ్‌లో 2 గంటల 50 నిమిషాలకు కుదించినట్లు తెలిపారు. దాదాపు మూడు గంటల నిడివి ఉన్నప్పటికీ, ప్రతి సన్నివేశం ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెట్టేలా ఉత్కంఠభరితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

గతంలో 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్' చిత్రాలతో సూపర్ హిట్ జోడీగా పేరుతెచ్చుకున్న విజయ్-రష్మిక హిట్ కాంబినేషన్ కావడం, దానికితోడు పాన్-ఇండియా రేంజ్‌లో బిగ్గెస్ట్ పీరియాడిక్ కథాంశంతో వస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా రణబలి'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అక్టోబర్ 16న విడుదల కానున్న ఈచిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలి.


©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఇసుక లారీ బీభత్సం.. ఆఖరి క్షణంలో బంపర్ పట్టుకుని ప్రాణాలు దక్కించుకున్న యువతినెట్‌ఫ్లిక్స్ ఉద్యోగులకు భారీ షాక్.. 5 శాతం మందిని తొలగించే అవకాశం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com