☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

నెట్‌ఫ్లిక్స్ ఉద్యోగులకు భారీ షాక్.. 5 శాతం మందిని తొలగించే అవకాశం!

నెట్‌ఫ్లిక్స్ ఉద్యోగులకు భారీ షాక్.. 5 శాతం మందిని తొలగించే అవకాశం! Caption of Image. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ తన మొత్తం ఉద్యోగుల్లో సుమారు 5 శాతం మందిని తొలగించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారంలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్ సంస్థలో దాదాపు 16వేల మంది ఫుల్-టైమ్ ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఈ లేఆఫ్స్ కారణంగా వందలాది మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎంటర్ టైన్మెంట్ రంగంలో పోటీ విపరీతంగా పెరిగిపోవడం, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు వీక్షకులను, యాడ్స్ రెవెన్యూను పెద్ద ఎత్తున ఆకర్షిస్తుండటంతో సాంప్రదాయ స్ట్రీమింగ్ సంస్థలపై తీవ్రమైన ఒత్తిడి
నెట్‌ఫ్లిక్స్ ఉద్యోగులకు భారీ షాక్.. 5 శాతం మందిని తొలగించే అవకాశం!
నెట్‌ఫ్లిక్స్ ఉద్యోగులకు భారీ షాక్.. 5 శాతం మందిని తొలగించే అవకాశం!

ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ తన మొత్తం ఉద్యోగుల్లో సుమారు 5 శాతం మందిని తొలగించాలని యోచిస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే వారంలో వెలువడే అవకాశం ఉందని సమాచారం. గత ఏడాది చివరి నాటికి నెట్‌ఫ్లిక్స్ సంస్థలో దాదాపు 16వేల మంది ఫుల్-టైమ్ ఉద్యోగులు పనిచేస్తుండగా.. ఈ లేఆఫ్స్ కారణంగా వందలాది మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఎంటర్ టైన్మెంట్ రంగంలో పోటీ విపరీతంగా పెరిగిపోవడం, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు వీక్షకులను, యాడ్స్ రెవెన్యూను పెద్ద ఎత్తున ఆకర్షిస్తుండటంతో సాంప్రదాయ స్ట్రీమింగ్ సంస్థలపై తీవ్రమైన ఒత్తిడి పెరుగుతోంది. మార్కెట్లో తమ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి, ఆదాయ వనరులను విస్తరించుకోవడానికి మీడియా కంపెనీలు నిరంతరం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే నెట్‌ఫ్లిక్స్ తన వ్యూహాలను మార్చుకుంటూ పునర్నిర్మాణ ప్రయత్నాలకు శ్రీకారం చుడుతున్నట్లు తెలుస్తోంది. 2022లోనూ యూజర్లు తగ్గటంతో ఉద్యోగులను తగ్గించిన సంగతి తెలిసిందే.

కేవలం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రుసుములపై మాత్రమే ఆధారపడకుండా.. ఆదాయ మార్గాలను వైవిధ్యపరచుకోవడంపై నెట్‌ఫ్లిక్స్ గత కొంతకాలంగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే కంపెనీ అడ్వర్టైజింగ్, లైవ్ ప్రోగ్రామింగ్, గేమింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. మరింత కష్టమర్లతో వృద్ధికి అదనపు అవకాశాలను సృష్టించుకోవడానికి ఈ చర్యలు ఎంతగానో దోహదపడతాయని కంపెనీ భావిస్తోంది. దీనిపై నెట్‌ఫ్లిక్స్ త్వరలోనే అధికారికంగా ఎవరిపై ప్రభావం ఉంటుందని ప్రకటించొచ్చని సమాచారం.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← Vijay Deverakonda : 'రణబాలి' రన్‌టైమ్‌పై రౌడీ స్టార్ క్లారిటీ.. ట్రైలర్‌పై మంత్రి నారా లోకేష్ క్రేజీ రియాక్షన్!యువతను చూసి ప్రభుత్వం భయపడుతోంది.. ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com