☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

యువతను చూసి ప్రభుత్వం భయపడుతోంది.. ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్

యువతను చూసి ప్రభుత్వం భయపడుతోంది.. ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్ Caption of Image. ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జంతర్ మంతర్ 2.0 నిరసనలు ఉధృతమయ్యాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించడంపై ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ తీవ్రంగా విమర్శించారు. యువతను చూసి ప్రభుత్వం భయపడుతోందని అని అన్నారు. నిరసనకు వచ్చిన వారిని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించడం, బారికేడ్లు ఏర్పాటు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. హింస జరిగే అవకాశం ఉందని, భద్రతకు ముప్పు ఉందని చెబుతూ ఇంత పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడం సరికాదన్నారు. నిరసనకు వస్తున్న యువతను చూసి ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఈసీ జ్ణానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల కమిషనర్ల నియామ
యువతను చూసి ప్రభుత్వం భయపడుతోంది.. ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్
యువతను చూసి ప్రభుత్వం భయపడుతోంది.. ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్

ఢిల్లీలో కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన జంతర్ మంతర్ 2.0 నిరసనలు ఉధృతమయ్యాయి. నిరసనకారులను అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించడంపై ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ తీవ్రంగా విమర్శించారు. యువతను చూసి ప్రభుత్వం భయపడుతోందని అని అన్నారు. నిరసనకు వచ్చిన వారిని అడ్డుకునేందుకు భారీగా పోలీసులను మోహరించడం, బారికేడ్లు ఏర్పాటు చేయడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. హింస జరిగే అవకాశం ఉందని, భద్రతకు ముప్పు ఉందని చెబుతూ ఇంత పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించడం సరికాదన్నారు. నిరసనకు వస్తున్న యువతను చూసి ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.

సర్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఈసీ జ్ణానేష్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని సవరించాలని కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ 2.0 నిరసనలు చేపట్టారు. ఈనిరసనలో వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు, యువత దేశం నలుమూలలనుంచి రాజధాని ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఇప్పటికే వేల మంది ఢిల్లీలో నిరసనల్లో పాల్గొన్నారు.

ఎస్ఐఆర్‌, సీఈసీ జ్ణానేష్ కుమార్ కు వ్యతిరేకంగా నిరసన..

ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీజేపీ ఆద్వర్యంలో జెన్ జీలు ఈ నిరసనలు చేపట్టారు. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన 2023 చట్టాన్ని కూడా నిరసనకారులు వ్యతిరేకించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన క్రమంలో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో జీన్ డ్రెజ్‌తో పాటు పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఎవరీ జీన్ డ్రెజ్?

జీన్ డ్రెజ్ బెల్జియంలో జన్మించిన ప్రముఖ ఆర్థికవేత్త, సామాజిక కార్యకర్త. భారతదేశంలో పేదరికం, ఆకలి నిర్మూలన, ఉపాధి హామీ, విద్య, వైద్యం వంటి అంశాలపై చాలా కాలంగా పనిచేస్తున్నారు. పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చేయడం, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ప్రభుత్వ విధానాలు ఉండాలని ఆయన పలు సందర్భాల్లో తన అభిప్రాయాలను వెల్లడించారు. 2002లో ఆయన భారత పౌరసత్వం పొందారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← నెట్‌ఫ్లిక్స్ ఉద్యోగులకు భారీ షాక్.. 5 శాతం మందిని తొలగించే అవకాశం!హుజూరాబాద్‌లో విషాదం.. అంత్యక్రియల వేళ చిగురించిన ఆశ.. అంతలోనే ఆవిరి! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com