☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

హుజూరాబాద్‌లో విషాదం.. అంత్యక్రియల వేళ చిగురించిన ఆశ.. అంతలోనే ఆవిరి!

హుజూరాబాద్‌లో విషాదం.. అంత్యక్రియల వేళ చిగురించిన ఆశ.. అంతలోనే ఆవిరి! Caption of Image. హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో మృతి చెందినట్లు నిర్ధారించిన మహిళకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, చితిపై ఉంచే సమయంలో ఆమె నాడి కొట్టుకుంటున్నట్లు బంధువులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఆశ చిగురించినప్పటికీ.. కొద్దిసేపటికే ఆమె మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించడంతో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. అంత్యక్రియల వేళ కలకలం హుజూరాబాద్‌లోని ఏకలవ్య కాలనీకి చెందిన కుతాడి సరిత (30) గత ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అంత్యక్ర
హుజూరాబాద్‌లో విషాదం.. అంత్యక్రియల వేళ చిగురించిన ఆశ.. అంతలోనే ఆవిరి!
హుజూరాబాద్‌లో విషాదం.. అంత్యక్రియల వేళ చిగురించిన ఆశ.. అంతలోనే ఆవిరి!

హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆసుపత్రిలో మృతి చెందినట్లు నిర్ధారించిన మహిళకు అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తుండగా, చితిపై ఉంచే సమయంలో ఆమె నాడి కొట్టుకుంటున్నట్లు బంధువులు గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఆశ చిగురించినప్పటికీ.. కొద్దిసేపటికే ఆమె మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించడంతో కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.

అంత్యక్రియల వేళ కలకలం

హుజూరాబాద్‌లోని ఏకలవ్య కాలనీకి చెందిన కుతాడి సరిత (30) గత ఐదు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.అయితే, స్మశానవాటికలో చితిపై ఉంచే సమయంలో సరిత నాడి కొట్టుకుంటున్నట్లు బంధువులు గుర్తించారు. దీంతో వెంటనే అప్రమత్తమైన వారు 108 అత్యవసర సేవలకు సమాచారం అందించారు.

సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం

సమాచారం అందుకున్న 108 సిబ్బంది స్మశానవాటికకు చేరుకుని సరితకు పల్స్, బీపీ పరీక్షించారు. అనంతరం సీపీఆర్ (CPR) చేసినప్పటికీ ఆమె ప్రాణాలు దక్కలేదని, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారని సమాచారం.కొద్దిసేపటి క్రితం వరకు మళ్లీ బతుకుతుందేమోనని ఆశించిన కుటుంబ సభ్యులకు ఈ పరిణామం తీవ్ర ఆవేదనకు గురిచేసింది.సరిత మృతితో ఆమె భర్త, ఇద్దరు చిన్నారులు దిక్కుతోచని స్థితిలో మిగిలారు. కుటుంబానికి ఆధారంగా ఉన్న మహిళ ఇలా అకాల మరణం చెందడంతో ఏకలవ్య కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← యువతను చూసి ప్రభుత్వం భయపడుతోంది.. ఆర్థిక వేత్త జీన్ డ్రెజ్249 పరుగులు చేసినా గెలవకపోతే ఎలా? భారత్ బౌలింగ్‌పై గవాస్కర్ ఆగ్రహం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com