☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

249 పరుగులు చేసినా గెలవకపోతే ఎలా? భారత్ బౌలింగ్‌పై గవాస్కర్ ఆగ్రహం!

249 పరుగులు చేసినా గెలవకపోతే ఎలా? భారత్ బౌలింగ్‌పై గవాస్కర్ ఆగ్రహం! Caption of Image. Sunil Gavaskar: రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 501 పరుగులు నమోదు కావడం టీ20 చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచింది. కానీ, పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్ల దారుణ వైఫల్యంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar), మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ (Varun Aaron) తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇక బౌలింగ్ కోచ్‌ని అడగాలి: సునీల్ గవాస్కర్ స్టార్ స్పోర్ట్స్ చర్చా కార్యక్రమంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ..
249 పరుగులు చేసినా గెలవకపోతే ఎలా? భారత్ బౌలింగ్‌పై గవాస్కర్ ఆగ్రహం!
249 పరుగులు చేసినా గెలవకపోతే ఎలా? భారత్ బౌలింగ్‌పై గవాస్కర్ ఆగ్రహం!

Sunil Gavaskar: రాంచీలోని JSCA ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ నిర్దేశించిన 249 పరుగుల లక్ష్యాన్ని వెస్టిండీస్ మరో 9 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ఏకంగా 501 పరుగులు నమోదు కావడం టీ20 చరిత్రలోనే ఒక రికార్డుగా నిలిచింది. కానీ, పరుగుల వరద పారిన ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్ల దారుణ వైఫల్యంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar), మాజీ పేసర్ వరుణ్ ఆరోన్ (Varun Aaron) తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఇక బౌలింగ్ కోచ్‌ని అడగాలి: సునీల్ గవాస్కర్

స్టార్ స్పోర్ట్స్ చర్చా కార్యక్రమంలో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ.. భారత బౌలింగ్ తీరును తప్పుపట్టారు. టీమిండియా 235 నుంచి 240 పరుగులు చేస్తుందని భావించాను, కానీ వారు మరో 9 రన్స్ ఎక్కువే చేశారు. కాబట్టి ఇక్కడ బ్యాటర్ల తప్పు ఏమాత్రం లేదు. బౌలర్లు వేయాల్సిన రీతిలో లైన్ అండ్ లెంగ్త్‌ వేయలేదు.. అసలు బౌలర్ల నుంచి ఏం ఆశించారు? వారు దాన్ని నెరవేర్చారా లేదా? అని భారత బౌలింగ్ కోచ్‌ను నిలదీస్తే అసలు ముచ్చట బయటకు వస్తుందని గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డారు.

అక్షర్ పటేల్‌కు ఓవర్ ఇవ్వడమే పెద్ద తప్పు:

మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ మాట్లాడుతూ.. భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ వ్యూహాన్ని విమర్శించారు.తొలి ఓవర్లోనే విండీస్ 2 వికెట్లు కోల్పోయినప్పుడు భారత్ ఫాస్ట్ బౌలర్లతోనే దాడిని కొనసాగించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. పవర్‌ప్లేలోని 4వ ఓవర్‌ను అక్షర్ పటేల్‌కు ఇవ్వడమే మ్యాచ్ ఓటమికి ప్రధాన కారణం అన్నాడు. కొత్త బంతిని ఎదుర్కొనేందుకు షాయ్ హోప్, రోవ్‌మన్ పొవెల్ బాగా తడబడతారు. అలాంటి సమయంలో స్పిన్నర్‌ను తీసుకువచ్చి 16 రన్స్ సమర్పించుకోవడం మ్యాచ్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేసిందని తెలియజేశాడు.

మంచు వల్లే ఓడిపోయామన్న కెప్టెన్ శ్రేయస్:

ఓటమి తర్వాత భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. మంచు (Dew) ప్రభావం వల్లే బౌలర్లు ఇబ్బంది పడ్డారని తెలిపాడు. రెండో ఇన్నింగ్స్‌లో మంచు విపరీతంగా రావడంతో మ్యాచ్‌లో పార్ స్కోరు (Par Score) ఎంతనేది అంచనా వేయడం కష్టం. 249 పరుగులు చేసినా ప్రత్యర్థి జట్టు మరో 2 ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించిందంటే మంచు ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చని శ్రేయస్ వివరణ ఇచ్చారు.

టీ20 మ్యాచ్‌లలో రెండు జట్లు కలిపి చేసిన మొత్తం రన్స్:

* 517 పరుగులు - సౌతాఫ్రికా vs వెస్టిండీస్ (సెంచూరియన్, 2023/2009)

* 501 పరుగులు - భారత్ vs వెస్టిండీస్ (రాంచీ, 2026)

* 499 పరుగులు - భారత్ vs ఇంగ్లండ్ (ముంబై, T20 వరల్డ్ కప్ 2026 సెమీఫైనల్)

* 496 పరుగులు - భారత్ vs న్యూజిలాండ్ (తిరువనంతపురం, 2026)

* 489 పరుగులు - వెస్టిండీస్ vs భారత్ (లాడర్‌హిల్, 2016)


©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← హుజూరాబాద్‌లో విషాదం.. అంత్యక్రియల వేళ చిగురించిన ఆశ.. అంతలోనే ఆవిరి!ఫొటో ఫీచర్ : దసరా సెలవులు.. ఊరిబాట పట్టిన జనం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com