☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

AP Schools Closed: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ఏడు జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవులు.. బయటకు రావొద్దని సూచన

AP Schools Closed : ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
AP Schools Closed: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ఏడు జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవులు.. బయటకు రావొద్దని సూచన

AP Schools Closed : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇవాళ రాత్రికి ఉత్తర కోస్తా – దక్షిణ ఒడిశా తీరంలోని విశాఖపట్టణం – గోపాల్‌పూర్ మధ్య తీవ్ర వాయుగుండంగా తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ క్రమంలో ఇవాళ, రేపు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఏపీలోని కూటమి సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించింది.

Also Read : PM Kisan-Rythu Bharosa : రైతులకు బిగ్ అలర్ట్ : 8 రోజుల్లో ఈ ఒక్క పని చేయకుంటే పీఎం కిసాన్, రైతుభరోసా బంద్..!

ఏపీలోని అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్టణం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. విశాఖపట్టణం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో స్కూళ్లకు ఇవాళ సెలవులు ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, అనకాపల్లి జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాలోనూ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ అవకాశం ఉందని రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. అలాగే తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 50 నుంచి 60 కి.మీ. వేగంతో బలమైన గాలులు వీస్తాయన్నారు. తీవ్ర వాయుగుండం కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← Bigg Boss Telugu 10 Updates: బిగ్ బాస్ హౌస్ లో కొత్త గ్రూప్.. ఇప్పుడు అందరి టార్గెట్ వాళ్ళే..Telangana Rains : తెలంగాణలో వర్షాల బీభత్సం.. 17జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఈ తేదీల్లో అత్యంత భారీ వర్షాలు.. బయటకు రావొద్దు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com