☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Telangana Rains : తెలంగాణలో వర్షాల బీభత్సం.. 17జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఈ తేదీల్లో అత్యంత భారీ వర్షాలు.. బయటకు రావొద్దు..

Telangana Rains : బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Rains : తెలంగాణలో వర్షాల బీభత్సం.. 17జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఈ తేదీల్లో అత్యంత భారీ వర్షాలు.. బయటకు రావొద్దు..

Telangana Rains : బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బుధ, గురువారాల్లో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

Also Read – Smartphone Screen Protectors : కేంద్రం కొత్త రూల్స్.. ఇక నాసిరకం స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ గార్డులకు చెక్.. BIS సర్టిఫికేట్ మస్ట్!

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతోపాటు.. కర్ణాటక, కోస్తాంధ్ర మీదుగా ద్రోణి కూడా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కొన్నిచోట్ల అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 25, 26 (శుక్ర, శని) తేదీల్లోనూ పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

బుధవారం పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్ధిపేట జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. అదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు అరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

గురువారం పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా.. అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్ధిపేట జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

భారీ వర్షాలతోపాటు ఈదురుగాలులు వీస్తాయని, వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదిలాఉంటే.. భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← AP Schools Closed: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ఏడు జిల్లాల్లో ఇవాళ స్కూళ్లకు సెలవులు.. బయటకు రావొద్దని సూచనRamya Pasupuleti : షార్ట్ డ్రెస్ లో తెలుగమ్మాయి అందాలు..రమ్య పసుపులేటి ఫొటోలు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com