☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

మీ పిల్లలు నలుగురిలో కలవట్లేదా ? కొత్తవాళ్లంటే భయమా? పేరెంట్స్ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి !

మీ పిల్లలు నలుగురిలో కలవట్లేదా ? కొత్తవాళ్లంటే భయమా? పేరెంట్స్ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి !
మీ పిల్లలు నలుగురిలో కలవట్లేదా ? కొత్తవాళ్లంటే భయమా? పేరెంట్స్ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి !
మీ పిల్లలు నలుగురిలో కలవట్లేదా ? కొత్తవాళ్లంటే భయమా? పేరెంట్స్ ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి !

కొందరు పిల్లలకి ఇంట్లో ఓ పట్టాన కాలు ఆగదు. ఎప్పుడూ ఆటలంటూ గ్రౌండ్స్ లోనే గంటలు గంటలు గడుపుతుంటారు. ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు కూడా. కానీ, మరికొందరు పిల్లలు మాత్రం నలుగురిలో కలవడానికి అసలు ఇష్టపడరు. కొత్తవాళ్లతో మాట్లాడాలంటేనే భయపడుతుంటారు. బంధువులు,స్నేహితుల ఇళ్లకి వెళ్లడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించరు. మరి ఇలాంటి పిల్లల్ని మార్చాలంటే ఎలా ..

*పిల్లలు నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడుతుంటే.. తరచూ వాళ్లని ఫ్రెండ్స్, బంధువుల ఇళ్లకి తీసుకెళ్తుండాలి. స్నేహితులతో కలిసి ఎక్కువసేపు ఆడుకునేలా చూడాలి. అప్పుడుప్పుడు పిల్లల ఫ్రెండ్స్ ని ఇంటికి పిలిచి లంచ్, డిన్నర్ లాంటివి ఆర్గనైజ్ చేస్తుండాలి. వీటివల్ల పిల్లలు సోషల్ కల్చర్ కి అలవాటవుతారు.

*పిల్లల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నా.. వాళ్లకు ఇష్టం లేకపోతే వెంటనే వచ్చేయొచ్చని చెప్పాలి. ఇలా చేయడం వల్ల కొత్త ప్రదేశాలకు, తెలియని మనుషుల మధ్యకు వెళ్లడానికి వాళ్లు ఇబ్బందిగా ఫీల్ అవ్వరు.

*చాలామంది పేరెంట్స్ ఇతర పిల్లలతో పోలుస్తూ 'నువ్వు కూడా అలా ఉండు" అని చెప్తుంటారు. కానీ, అలా ఇతరులతో పోల్చడం వల్ల పిల్లల మనసు నొచ్చుకుంటుంది. అందుకే అలాంటి పొరపాట్లకి దూరంగా ఉండాలి.

*ప్రేమగా వాళ్లలో మార్పు తెచ్చే ప్రయత్నం చేయాలి. ఫ్యామిలీ ఫంక్షన్స్ లో ఫన్నీ గేమ్స్ లాంటివి పెట్టి అందులో పిల్లల్ని భాగం చేయాలి.

*స్కూల్ తర్వాత వీలైనంత ఎక్కువసేపు ఫ్రెండ్స్ తో ఆడుకోనివ్వాలి. పిల్లల ప్రవర్తన లో ఏ మాత్రం మార్పు కనిపించినా వెంటనే మెచ్చుకోవాలి. దానివల్ల వాళ్లలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← భారత్‌కు ట్రంప్ భారీ ఊరట.. 100 శాతం టారిఫ్‌ల ముప్పు తప్పినట్లేనా?సికింద్రాబాద్ లో లీగల్ అసిస్టెంట్ పోస్టులు .. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com