☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Arjun Sarja | 64 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే స్టంట్స్.. అర్జున్ సర్జా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనా?

Arjun Sarja | దక్షిణాది సినీ పరిశ్రమలో ‘యాక్షన్ కింగ్’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జా ఇప్పటికీ తన ఫిట్‌నెస్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. 64 ఏళ్ల వయసులోనూ యువకుడిలా కఠినమైన యాక్షన్ విన్యాసాలు చేయగల ఆయన సామర్థ్యానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
Arjun Sarja | 64 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే స్టంట్స్.. అర్జున్ సర్జా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనా?

Arjun Sarja | దక్షిణాది సినీ పరిశ్రమలో ‘యాక్షన్ కింగ్’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అర్జున్ సర్జా ఇప్పటికీ తన ఫిట్‌నెస్‌తో అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. 64 ఏళ్ల వయసులోనూ యువకుడిలా కఠినమైన యాక్షన్ విన్యాసాలు చేయగల ఆయన సామర్థ్యానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో అర్జున్ సర్జా ఎంతో సులభంగా గాల్లోకి కాలు ఎత్తి, కరాటే విన్యాసంతో బాటిల్ మూతను ఎగరగొట్టారు. ఈ స్టంట్‌లో ఆయన చూపించిన వేగం, శరీర సౌష్టవం, కాళ్ల ఫ్లెక్సిబిలిటీ చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వయసు 64కు చేరినా ఆయనలోని చురుకుదనం ఏమాత్రం తగ్గలేదంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

అర్జున్ సర్జా ఫిట్‌నెస్‌కు ప్రధాన కారణాల్లో మార్షల్ ఆర్ట్స్ సాధన ఒకటిగా చెప్పొచ్చు. చిన్నతనం నుంచే మార్షల్ ఆర్ట్స్‌పై ఆసక్తి పెంచుకున్న ఆయన.. ఇప్పటికీ కరాటే, కిక్ బాక్సింగ్ వంటి శిక్షణను కొనసాగిస్తున్నట్లు గతంలో పలుమార్లు వెల్లడించారు. శరీరాన్ని చురుకుగా ఉంచేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు యోగా, స్ట్రెచింగ్ వంటి సాధనలకు కూడా ప్రాధాన్యత ఇస్తారని సమాచారం. కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా క్రమశిక్షణతో కూడిన జీవనశైలి, సమతుల్యమైన ఆహారపు అలవాట్లు కూడా తన ఫిట్‌నెస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాయని అర్జున్ సర్జా గతంలో చెప్పిన సందర్భాలున్నాయి. వయసు పెరిగే కొద్దీ శారీరక దారుఢ్యాన్ని కాపాడుకోవాలంటే నిరంతర సాధన, క్రమశిక్షణ అవసరమనే విషయాన్ని ఆయన జీవనశైలి చూపిస్తోంది.

అర్జున్ సర్జా సినీ ప్రస్థానం విషయానికి వస్తే.. తెలుగులో ఆయన నటించిన తొలి చిత్రంగా ‘మా పల్లెలో గోపాలుడు’ (1985) నిలిచింది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస అవకాశాలు అందుకుంటూ దక్షిణాదిలో యాక్షన్ హీరోగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ‘జెంటిల్‌మెన్’, ‘ఒకే ఒక్కడు’, ‘హనుమాన్ జంక్షన్’, ‘ప్రసాద్’, ‘పుట్టింటికి రా చెల్లి’ వంటి సినిమాలు ఆయనకు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. తమిళంలో తెరకెక్కిన పలు చిత్రాలు తెలుగులోకి అనువాదం కావడంతో ఆయనకు ఇక్కడ కూడా భారీ అభిమానగణం ఏర్పడింది. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కలిపి 160కి పైగా చిత్రాల్లో నటించిన అర్జున్.. నటుడిగానే కాకుండా దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకున్నారు. ‘సేవగన్’తో దర్శకుడిగా మారిన ఆయన ఆ తర్వాత ‘జై హింద్’, ‘కర్ణ’, ‘ఎజుమలై’, ‘పరశురామ్’, ‘జై హింద్ 2’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← భూ భారతిపై అవగాహన కలిగి ఉండాలి : ఆర్డీవో వేణుమాధవ్Jagadish Reddy | రేవంత్‌ మంచి బొగ్గును ఏపీలో తన గురువు చంద్రబాబుకి పంపిస్తున్నడు : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com