☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

భూ భారతిపై అవగాహన కలిగి ఉండాలి : ఆర్డీవో వేణుమాధవ్

భూ భారతి ఆన్‌లైన్ పోర్టల్ ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ అన్నారు. గురువారం తుంగ‌తుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంను ఆయ‌న‌ పరిశీలించి మాట్లాడారు. తుంగతుర్తి మండల వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించి..
భూ భారతిపై అవగాహన కలిగి ఉండాలి : ఆర్డీవో వేణుమాధవ్

తుంగ‌తుర్తి, సెప్టెంబ‌ర్ 24 : భూ భారతి ఆన్‌లైన్ పోర్టల్ ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూర్యాపేట ఆర్డీఓ వేణుమాధవ్ అన్నారు. గురువారం తుంగ‌తుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంను ఆయ‌న‌ పరిశీలించి మాట్లాడారు. తుంగతుర్తి మండల వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి సమస్యలను త్వరగా పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ దయానందం, డిప్యూటీ ఎమ్మార్వో కంట్లమయ్య, ఆర్ఐలు శ్రీధర్, మణికుమార్, రెవిన్యూ సిబ్బంది జోహార్ పాల్గొన్నారు.

భూ భారతిపై అవగాహన కలిగి ఉండాలి : ఆర్డీవో వేణుమాధవ్

భూ భారతిపై అవగాహన కలిగి ఉండాలి : ఆర్డీవో వేణుమాధవ్

పెద్ద చెరువు పరిశీల‌న

తుంగతుర్తి మండల కేంద్రంలోని వెలుగుపల్లి రోడ్డులో ఉన్న పెద్ద చెరువు ఇటీవ‌ల కురిసిన భారీ వర్షానికి అలుగు పోస్తుండడంతో రెవిన్యూ శాఖ అధికారితో కలిసి ఆర్డీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ కూడా చేపలు పట్టేందుకు చెరువులు, కుంటల వద్దకు వెళ్ల‌వ‌ద్ద‌న్నారు. వ్యవసాయ బావుల వద్ద రైతులు జాగ్రత్తగా ఉండాలని, శిథిలావస్థల భవనాల్లో ఉండవద్దన్నారు. ఆయ‌న వెంట ఆర్ఐ శ్రీధర్, జిపిఓ శ్యాం కుమార్ ఉన్నారు.

చెరువును తలపిస్తున్న వీధి

తుంగతుర్తి మండల కేంద్రంలోని రెండో వార్డులో మహాత్మా గాంధీ విగ్రహం సందు నుండి స్టేషన్ రోడ్డుకు వెళ్లే వీధి మొత్తం వర్ష‌పు నీటితో చెరువును తలపిస్తోంది. రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నీళ్లు మొత్తం వీధుల్లో చేరి మొత్తం జలమయంగా మారింది. అటు నుండి వెళ్లేందుకు వాహనదారులు, కాల‌నీవాసులు ఇబ్బందులు పడుతున్నారు.

భూ భారతిపై అవగాహన కలిగి ఉండాలి : ఆర్డీవో వేణుమాధవ్

భూ భారతిపై అవగాహన కలిగి ఉండాలి : ఆర్డీవో వేణుమాధవ్

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← అక్టోబర్ 2న "No UPI Day" .. వ్యాపార సంఘాల తిరుగుబాటు: షాపుల్లో క్యూఆర్ కోడ్స్ పనిచేయవు!Arjun Sarja | 64 ఏళ్ల వయసులోనూ అదిరిపోయే స్టంట్స్.. అర్జున్ సర్జా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదేనా? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com