☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కాంగోలో కూలిన విమానం.. 17 మందికి ప్రాణాలు పోయాయి..

కాంగోలో కూలిన విమానం.. 17 మందికి ప్రాణాలు పోయాయి.. Caption of Image. ప్రాణాలు కోల్పయిన వారిలో ఇద్దరు ఆర్మీ ఉన్నతాధికారులు కిన్షాసా: కాంగోలో ఆర్మీ ఉన్నతాధికారులతో వెళుతున్న చిన్న విమానం ఒకటి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆర్మీకి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులతో పాటు మొత్తం 17 మంది దుర్మరణం చెందారు. కాంగో సైనిక అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంగే శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. దేశ సైనిక కోర్టు ప్రధానాధికారి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటాలయి టియెండే, సాయుధ బలగాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బాకుమి లుకిలియా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ప్రతినిధి బృందానికి చెందిన మరో 12 మంది, విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తెలిపారు. నైరుతి ప్రాంతంలోని కిక్విట్ న
కాంగోలో కూలిన విమానం.. 17 మందికి ప్రాణాలు పోయాయి..
కాంగోలో కూలిన విమానం.. 17 మందికి ప్రాణాలు పోయాయి..
  • ప్రాణాలు కోల్పయిన వారిలో ఇద్దరు ఆర్మీ ఉన్నతాధికారులు

కిన్షాసా: కాంగోలో ఆర్మీ ఉన్నతాధికారులతో వెళుతున్న చిన్న విమానం ఒకటి కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఆర్మీకి చెందిన ఇద్దరు సీనియర్ అధికారులతో పాటు మొత్తం 17 మంది దుర్మరణం చెందారు. కాంగో సైనిక అధికార ప్రతినిధి మేజర్ జనరల్ ఎఫోమి ఎకెంగే శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు.

దేశ సైనిక కోర్టు ప్రధానాధికారి లెఫ్టినెంట్ జనరల్ ముటోంబో కటాలయి టియెండే, సాయుధ బలగాల ఆడిటర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ బాకుమి లుకిలియా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. వీరితో పాటు ప్రతినిధి బృందానికి చెందిన మరో 12 మంది, విమాన సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయినట్లు ఆయన తెలిపారు.

నైరుతి ప్రాంతంలోని కిక్విట్ నగరం నుంచి దేశ రాజధాని కిన్షాసాకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా కెంజె ప్రాంతంలో కూలిపోయినట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు. సివిల్ ఏవియేషన్ అథారిటీ బోర్డు చైర్మన్ ట్రిఫన్ కిన్-కియె
ములుంబా మాట్లాడుతూ.. ప్రమాదానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← షూటింగ్‌‌లో మరో సిల్వర్‌‌ మెడల్‌అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్.. ఎర్లీ డీల్స్ ఇవే.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com