☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

షూటింగ్‌‌లో మరో సిల్వర్‌‌ మెడల్‌

షూటింగ్‌‌లో మరో సిల్వర్‌‌ మెడల్‌ Caption of Image. షూటింగ్‌‌లో ఇండియాకు మరో సిల్వర్‌‌ మెడల్‌‌ లభించింది. విమెన్స్‌‌ 50 మీటర్ల రైఫిల్‌‌ త్రీ పొజిషన్‌‌ టీమ్‌‌ విభాగంలో ఇండియా షూటర్లు తిలోత్తమ సేన్‌‌–విదర్స వినోద్‌‌–ఆషి చౌక్సే త్రయం 1763 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా (1773), కజకిస్తాన్‌‌ (1754) వరుసగా స్వర్ణం, కాంస్యం సొంతం చేసుకున్నాయి. వ్యక్తిగత విభాగంలో తిలోత్తమ 337.3 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం కోల్పోయింది. విదర్స వినోద్‌‌ (324.7) ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫయింగ్‌‌లో తిలోత్తమ నీలింగ్‌‌, ప్రోన్‌‌, స్టాండింగ్‌‌లో మొత్తం 590, విదర్స 588 పాయింట్లు సాధించి ఫైనల్స్‌‌కు అర్హత సాధించారు. కానీ ఆషి 585 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్స్‌‌ అవకాశాన్ని కోల్పోయి
షూటింగ్‌‌లో మరో సిల్వర్‌‌ మెడల్‌
షూటింగ్‌‌లో మరో సిల్వర్‌‌ మెడల్‌

షూటింగ్‌‌లో ఇండియాకు మరో సిల్వర్‌‌ మెడల్‌‌ లభించింది. విమెన్స్‌‌ 50 మీటర్ల రైఫిల్‌‌ త్రీ పొజిషన్‌‌ టీమ్‌‌ విభాగంలో ఇండియా షూటర్లు తిలోత్తమ సేన్‌‌–విదర్స వినోద్‌‌–ఆషి చౌక్సే త్రయం 1763 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది. చైనా (1773), కజకిస్తాన్‌‌ (1754) వరుసగా స్వర్ణం, కాంస్యం సొంతం చేసుకున్నాయి. వ్యక్తిగత విభాగంలో తిలోత్తమ 337.3 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి తృటిలో పతకం కోల్పోయింది.

విదర్స వినోద్‌‌ (324.7) ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. క్వాలిఫయింగ్‌‌లో తిలోత్తమ నీలింగ్‌‌, ప్రోన్‌‌, స్టాండింగ్‌‌లో మొత్తం 590, విదర్స 588 పాయింట్లు సాధించి ఫైనల్స్‌‌కు అర్హత సాధించారు. కానీ ఆషి 585 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచి ఫైనల్స్‌‌ అవకాశాన్ని కోల్పోయింది.

ఇక స్క్వాష్‌‌లో అనహత్‌‌ సింగ్‌‌, అభయ్‌‌ ఫైనల్లోకి దూసుకెళ్లి రెండు పతకాలు ఖాయం చేశారు. హాకీ ఆఖరి లీగ్‌‌ మ్యాచ్‌‌లో 2–0తో జపాన్‌‌ను ఓడించిన ఇండియా హాకీ టీమ్‌‌ సెమీస్‌‌ బెర్త్‌‌ను ఖాయం చేసుకుంది. బాక్సింగ్‌‌లో కపిల్‌‌ పొకారియా, ప్రియా గంగాస్‌‌ క్వార్టర్స్‌‌కు చేరుకోగా, ఈక్వెస్ట్రియాన్‌‌లో జై సుద్‌‌, హ్రిదయ్‌‌ విపుల్‌‌ డ్రెస్సేజ్‌‌ ఫైనల్స్‌‌లోకి ప్రవేశించారు. బ్యాడ్మింటన్‌‌లో సింధు, ఉన్నతి హుడా విజయాలు సాధించగా, ఆయుష్‌‌, లక్ష్యసేన్‌‌ నిష్క్రమించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఈ రెస్పాన్స్.. నాకు చాలా కొత్త ఎక్స్‌‌‌‌పీరియన్స్: ప్యారడైజ్ టాక్పై నానికాంగోలో కూలిన విమానం.. 17 మందికి ప్రాణాలు పోయాయి.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com