☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఈ రెస్పాన్స్.. నాకు చాలా కొత్త ఎక్స్‌‌‌‌పీరియన్స్: ప్యారడైజ్ టాక్పై నాని

ఈ రెస్పాన్స్.. నాకు చాలా కొత్త ఎక్స్‌‌‌‌పీరియన్స్: ప్యారడైజ్ టాక్పై నాని
ఈ రెస్పాన్స్.. నాకు చాలా కొత్త ఎక్స్‌‌‌‌పీరియన్స్: ప్యారడైజ్ టాక్పై నాని
ఈ రెస్పాన్స్.. నాకు చాలా కొత్త ఎక్స్‌‌‌‌పీరియన్స్: ప్యారడైజ్ టాక్పై నాని

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు మిక్స్ డ్ టాక్ రాగా, తర్వాత నుంచి మంచి రెస్పాన్స్‌‌‌‌తో దూసుకెళ్తోందని టీమ్ చెప్పింది. ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో నాని మాట్లాడుతూ ‘ఈ సినిమా విషయంలో అన్నీ కొత్తగానే జరిగాయి.

ఫిలిం మేకింగ్, లొకేషన్స్‌‌‌‌లో సిచువేషన్, ట్రైలర్ లేకపోవడం, రిలీజ్ ముందు ఉండే సిచువేషన్.. ఇవన్నీ కొత్తగా ఉన్నాయి. ఒక కొత్త సినిమా చేస్తున్నాం, ఒక కొత్త ఎక్స్‌‌‌‌పీరియన్స్ ఇస్తున్నాం అనుకున్నాం. కానీ ఇలా రెస్పాన్స్ కూడా ఇంత కొత్తగా ఉంటుందని అనుకోలేదు. ఇది నాకు చాలా కొత్త ఎక్స్‌‌‌‌పీరియన్స్. నేను ఎన్నో సినిమాలు చేశాను. ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ అయిన ఉదయం చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంటుంది. సాయంత్రానికి మిక్స్‌‌‌‌డ్ రెస్పాన్స్‌‌‌‌గా మారిపోతుంది.

‘ప్యారడైజ్’కి రివర్స్‌‌‌‌లో జరిగింది. రిలీజ్ రోజున ప్రీమియర్స్‌‌‌‌కి ఒకలాగ మొదలైంది. ఆ తర్వాత ప్రతి షోకి పాజిటివిటీ పెరుగుతుంది, ఇంకా బెటర్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఇలాంటి రెస్పాన్స్‌‌‌‌ని నేను చూడలేదు’ అని అన్నాడు.

మోహన్ బాబు మాట్లాడుతూ ‘నాని ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు. ‘ప్యారడైజ్’ సూపర్ డూపర్ హిట్‌‌‌‌గా నిలిచింది. శ్రీకాంత్ ఓదెల ఎక్స్‌‌‌‌ట్రార్డినరీ డైరెక్టర్‌‌‌‌. ఆయన దేశంలోనే ఒక టాప్ డైరెక్టర్ అవుతారు’ అని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న టీమ్ అంతా ఈ స్పందన పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← గోల్డ్‌‌ మార్కెట్‌‌ రహస్యాలపై ‘సిటీ ఆఫ్‌‌ గోల్డ్‌‌’షూటింగ్‌‌లో మరో సిల్వర్‌‌ మెడల్‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com