☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

BRS Leaders Arrests | కరెంటు కోతలపై నిలదీస్తే అరెస్టులా? : బీఆర్ఎస్ నేతల మండిపాటు

BRS Leaders Arrests | కరెంటు కోతలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్టులు చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
BRS Leaders Arrests | కరెంటు కోతలపై నిలదీస్తే అరెస్టులా? : బీఆర్ఎస్ నేతల మండిపాటు

మహాదేవపూర్ : కరెంటు కోతలపై ప్రభుత్వాన్ని నిలదీస్తే అరెస్టులు (Arrests ) చేయడం దారుణమని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ( KTR ) పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన పవర్ ప్లాంట్ల ( Power Plants ) ముట్టడి కార్యక్రమంలో పాల్గొనకుండా మహాదేవపూర్ మండల నాయకులు శ్రీపతిబాపు, కేదారి గీత, అలీం ఖాన్, కూరతోట శ్రీహరి, చిల్ల కుమార్‌ను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతును అణచివేయడమే ప్రభుత్వ విధానమా అని ప్రశ్నించారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

గత ప్రభుత్వ హయాంలో నిరంతర విద్యుత్‌తో రైతులు సంతోషంగా ఉన్నారని, ప్రస్తు తం విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, బొగ్గు నిల్వలపై ప్రభుత్వం చెబుతున్న కారణాలు కుంటి సాకులేనని విమర్శించారు. రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా వెంటనే నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Oyo Case | ఓయో యువతి మృతి కేసులో ట్విస్ట్‌.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం..!Danam Nagender: ఈ తీర్పు ఊహించిందే.. ఇక ప్రజాక్షేత్రంలోనే, ఉప ఎన్నిక గెలుపు మాదే.. సుప్రీం తీర్పుపై దానం సంచలన కామెంట్స్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com