☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Oyo Case | ఓయో యువతి మృతి కేసులో ట్విస్ట్‌.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం..!

Oyo Case | విశాఖపట్నానికి చెందిన యువతి షారన్ నిఖిత హైదరాబాద్‌లోని మాదాపూర్ సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్-5లో ఉన్న ఓయో హోటల్ రూమ్ లో అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా యువతి మృతి కేసులో పరారీలో ఉన్న ప్రియుడు రవితేజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Oyo Case | ఓయో యువతి మృతి కేసులో ట్విస్ట్‌.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం..!

Oyo Case | ఇటీవల మాదాపూర్ ఓయో హోటల్లో యువతి అనుమానాస్పద మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. విశాఖపట్నానికి చెందిన యువతి షారన్ నిఖిత టోప్నో (23) ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి హైదరాబాద్‌లోని మాదాపూర్ సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్-5లో ఉన్న ఓయో హోటల్ రూమ్ నం.303లో అనుమానాస్పదంగా మృతి చెందింది. హోటల్ గదిని పరిశీలించిన పోలీసులు అక్కడి గోడలు, బెడ్ షీట్ పై రక్తపు మరకలను గుర్తించి నిందితుడు శ్రీనివాస రవితేజ కోసం గాలిస్తున్నాయి.

కాగా యువతి మృతి కేసులో పరారీలో ఉన్న ప్రియుడు రవితేజ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రవితేజ ఏపీ అనకాపల్లి జిల్లా పరవాడ మండలం ఈదుమెట్ల మర్రిపాలెంలోని తన ఇంట్లో బుధవారం ఆత్మహత్యకు యత్నించాడు. ఫ్లోర్ క్లీనింగ్ లక్విడ్ తాగిన రవితేజను వెంటనే కుటుంబసభ్యులు అతడిని విశాఖ KGHకు తరలించారు. ప్రస్తుతం రవితేజ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

వెలుగులోకి కీలక విషయాలు..
యువతి మృతి కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఓయో రూమ్‌లో బీర్, విస్కీ బాటిల్స్‌ పగిలినట్లు గుర్తించిన పోలీసులు బెడ్‌తోపాటు రూమ్ గోడలపై రక్తపు మరకలను గుర్తించారు. మృతురాలు షారన్ నిఖిత ముఖం, శరీరంపైనే కాకుండా, తల వెనుక కూడా తీవ్ర గాయాలు.

అర్ధరాత్రి యువతి స్పృహ కోల్పోయిందంటూ రవితేజ తన వద్దకు వచ్చాడని హోటల్ సూపర్‌వైజర్ తెలిపాడు. అంబులెన్స్‌లో తీసుకెళ్దామంటే.. వద్దు, బైక్‌ చాలని నిఖితను ఆసుపత్రికి తీసుకెళ్లిన రవితేజ అనంతరం నిఖిత మృతి చెందిందని డాక్టర్లు చెప్పడంతో, అక్కడి నుంచి పరారయ్యాడు. ఇద్దరి మధ్య మూడేళ్ల వయసు వ్యత్యాసం.. అబ్బాయి కంటే అమ్మాయే పెద్దదని పోలీసులు గుర్తించారు.

Read Also :

President Murmu | కాంస్యం గెలిచిన భార‌త మెన్స్ బ్యాడ్మింట‌న్ జ‌ట్టుకు రాష్ట్ర‌ప‌తి అభినంద‌న‌లు..!

Ganesh immersion | గణేశుడి నిమజ్జనానికి వెళ్లి.. వ్యక్తి మృతి

Ranbir Kapoor | ‘లవ్ అండ్ వార్’ విడుదల తేదీ ఖరారు.. సరికొత్త లుక్‌లో రణ్‌బీర్ కపూర్!

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← గుర్వాయిగుడెంలో టోర్నడో బీభత్సం.. పంట తోటల‌కు తీవ్ర న‌ష్టంBRS Leaders Arrests | కరెంటు కోతలపై నిలదీస్తే అరెస్టులా? : బీఆర్ఎస్ నేతల మండిపాటు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com