☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

గుర్వాయిగుడెంలో టోర్నడో బీభత్సం.. పంట తోటల‌కు తీవ్ర న‌ష్టం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీ పరిధిలోని గుర్వాయిగుడెం గ్రామంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వీచిన బలమైన గాలులు, టోర్నడో ప్రభావంతో గ్రామ పరిసరాల్లోని పంట తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా....
గుర్వాయిగుడెంలో టోర్నడో బీభత్సం.. పంట తోటల‌కు తీవ్ర న‌ష్టం

దమ్మపేట, సెప్టెంబర్ 24 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం జగ్గారం పంచాయతీ పరిధిలోని గుర్వాయిగుడెం గ్రామంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. అకస్మాత్తుగా వీచిన బలమైన గాలులు, టోర్నడో ప్రభావంతో గ్రామ పరిసరాల్లోని పంట తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా మామిడి, జీడి, పత్తి, పామాయిల్ తోటల్లో భారీగా నష్టం జరిగినట్లు రైతులు తెలిపారు. బలమైన గాలుల ధాటికి పలు చెట్లు నేలకొరిగాయి. మామిడి, జీడి తోటల్లో కొమ్మలు విరిగిపడడంతో పాటు పామాయిల్ చెట్లు కూడా దెబ్బతిన్నాయి. పత్తి పంట సైతం గాలుల ప్రభావానికి నష్టపోయినట్లు రైతులు పేర్కొన్నారు.

ఏళ్ల తరబడి పంట తోటలను పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న రైతులకు ఒక్కసారిగా వచ్చిన టోర్నడో తీవ్ర ఆందోళన కలిగించింది. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యం రూపంలో నష్టం వాటిల్లడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే గ్రామంలో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించి, సమగ్రంగా నష్టం అంచనా వేయాలని రైతులు కోరుతున్నారు. దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

గుర్వాయిగుడెంలో టోర్నడో బీభత్సం.. పంట తోటల‌కు తీవ్ర న‌ష్టం

గుర్వాయిగుడెంలో టోర్నడో బీభత్సం.. పంట తోటల‌కు తీవ్ర న‌ష్టం

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← బొగ్గు కొర‌త‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణం : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డిOyo Case | ఓయో యువతి మృతి కేసులో ట్విస్ట్‌.. ప్రియుడి ఆత్మహత్యాయత్నం..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com