☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

బొగ్గు కొర‌త‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణం : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ (YTPS)లో బొగ్గు కొరత ఉంది అంటే దానికి రాష్ట్ర‌ ప్రభుత్వం, ఇంధ‌న శాఖ మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్రమార్కనే కార‌ణం అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంట‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి అన్నారు. గురువారం దామరచర్ల మండలంలోని యాదాద్రి థ‌ర్మల్ పవర్ ప్లాంట్‌ను...
బొగ్గు కొర‌త‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణం : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

– సింగ‌రేణి స‌రిప‌డా ఉత్ప‌త్తి చేస్తున్నా ఎందుకు ఇస్త‌లేరు?
– ఇటు ఏపీ, అటు క‌ర్ణాట‌క‌కు దొంగ‌త‌నంగా బొగ్గు అమ్ముకుంటున్న వైనం
– మాజీ సీఎం కేసీఆర్‌లాగే 24 గంట‌ల క‌రెంట్ ఇవ్వాల‌ని డిమాండ్‌
– ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యేల‌తో క‌లిసి వైటీపీఎస్ సంద‌ర్శ‌న‌

న‌ల్ల‌గొండ‌, సెప్టెంబ‌ర్ 24 : యాదాద్రి థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ ప్లాంట్ (YTPS)లో బొగ్గు కొరత ఉంది అంటే దానికి రాష్ట్ర‌ ప్రభుత్వం, ఇంధ‌న శాఖ మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్రమార్కనే కార‌ణం అని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంట‌కండ్ల జ‌గ‌దీశ్‌రెడ్డి అన్నారు. గురువారం దామరచర్ల మండలంలోని యాదాద్రి థ‌ర్మల్ పవర్ ప్లాంట్‌ను ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, ఇత‌ర నేత‌లు, బీఆర్ఎస్ ప్ర‌తినిధుల బృందంతో క‌లిసి ప‌రిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ ప్లాంట్లను మూసివేస్తూ కరెంటు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను, ముఖ్యంగా రైతులకు ఇబ్బందులకు గురి చేస్తునందుకు ప్లాంట్ ను సందర్శించి, విద్యుత్ ఉత్పత్తి నిలిపివేతకు గల కారణాలను ప్లాంట్‌లోని అధికారుల‌తో స‌మావేశమై చ‌ర్చించారు.

బొగ్గు కొర‌త‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణం : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

బొగ్గు కొర‌త‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణం : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎంతో పనికిమాలిన ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి తన గురువు, ఆంధ్రప్రదేశ్ సీఎంకు ఒక‌వైపు మ‌రోవైపు కర్ణాటక కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి దొంగ‌త‌నంగా బొగ్గును అమ్ముకుంటున్నాడు. ఇది కేవలం ప్రభుత్వ స్కాం తప్ప ఇంకోటి కాద‌న్నారు. బొగ్గు మంత్రి అన్ని బుద్ధిలేని మాటలు మాట్లాడుతున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. సింగరేణి భ్రమ్మాండంగా బొగ్గు ఉత్పత్తి చేస్తుంద‌ని, 40 లక్షల టన్నుల బొగ్గును దొంగతనంగా అమ్ముకున్న‌ట్లు తెలిపారు. పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్ప‌త్తి చేసేలా తప్పకుండా అన్ని పవర్ ప్లాంట్లకు ప్ర‌భుత్వం బొగ్గు స‌ర‌ఫ‌రా చేయాల‌న్నారు. 24 గంటల విద్యుత్ కేసీఆర్ ఏ విధంగా ఇచ్చాడో అదేవిధంగా ఇప్పుడు కూడా విద్యుత్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

బొగ్గు కొర‌త‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణం : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

బొగ్గు కొర‌త‌కు ప్ర‌భుత్వ‌మే కార‌ణం : మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Trump: ఆ మీడియా ప్ర‌తినిధుల‌పై బ్యాన్ ఎత్తివేయండి.. ట్రంప్ స‌ర్కారుకు ఫెడ‌ర‌ల్ కోర్టు ఆదేశంగుర్వాయిగుడెంలో టోర్నడో బీభత్సం.. పంట తోటల‌కు తీవ్ర న‌ష్టం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com