☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!

Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్‌లో భారత్‌ అదరగొడుతోంది. నిషిన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. కేవలం 9.5 ఓవర్లలోనే 45 పరుగులకు ఆలౌటైంది. భారత్‌ బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, […]
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!

Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ రెండో సెమీఫైనల్‌లో భారత్‌ అదరగొడుతోంది. నిషిన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. కేవలం 9.5 ఓవర్లలోనే 45 పరుగులకు ఆలౌటైంది.

భారత్‌ బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. వైభవ్ సూర్యవంశీ 21 బంతుల్లోనే 38 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ శర్మ 7, సంజూ శాంసన్ 7, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 13 పరుగులు చేశారు. అక్షర్ పటేల్ 8, తిలక్ వర్మ 2, శివమ్ దూబే 3 పరుగులు చేశారు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 3 బంతుల్లో 7 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో భారత్‌ 20 ఓవర్లలో 169/7 స్కోరు సాధించి.. శ్రీలంక ముందు 170 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

లక్ష్య ఛేదనలో శ్రీలంక ఇన్నింగ్స్‌ ప్రారంభం నుంచే తడబడింది. జస్ప్రీత్ బుమ్రా వరుసగా కీలక వికెట్లు తీసి లంక బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశాడు. శ్రీలంక ఓపెనర్ సినెత్ జయవర్ధన రెండు బంతులు ఎదుర్కొని ఖాతా తెరవకుండానే బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఆ తర్వాత సోహన్ డి లివెరాను కూడా బుమ్రానే పెవిలియన్‌కు పంపాడు. నువానిడు ఫెర్నాండో 11 బంతుల్లో 15 పరుగులు చేసి శ్రీలంక తరఫున అత్యధిక స్కోరు సాధించాడు. సాహన్ అరచిగే 9 పరుగులు, చామిక కరుణరత్నే 4 పరుగులు, థరిందు రత్నాయకే 5 పరుగులు చేశారు. మిగిలిన బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.

భారత్‌ తరఫున అక్షర్ పటేల్ 3 ఓవర్లలో కేవలం 8 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. బుమ్రా 2 ఓవర్లలో 7 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్, అభిషేక్ శర్మ కేవలం 5 బంతుల్లో 2 వికెట్లు సాధించాడు. దీంతో శ్రీలంక 9.5 ఓవర్లలో 45 పరుగులకే ఆలౌటైంది. దీనితో భారత్ ఏషియన్ గేమ్స్ 2026 పురుషుల క్రికెట్ లోఫైనల్ కు చేరుకుంది. బంగారు పతకం కోసం భారత్ పాకిస్థాన్ తో అమితుమీ తేల్చుకోనుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Abhishek Sharma Bowling: ఏషియన్ గేమ్స్‌లో అభిషేక్ శర్మ సంచలనం.. వరుసగా మూడు వికెట్స్!BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com