☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

BC Reservations: స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధం అవుతున్న సమయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. ఈ రిజర్వేషన్లపై తీసుకొచ్చిన జీవోలను కొట్టివేసింది.. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, తదుపరి న్యాయపరమైన చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలు, […]
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..

BC Reservations: స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధం అవుతున్న సమయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. ఈ రిజర్వేషన్లపై తీసుకొచ్చిన జీవోలను కొట్టివేసింది.. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, తదుపరి న్యాయపరమైన చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్‌లు, జిల్లా ప్రజా పరిషత్‌లలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంచాయతీరాజ్ శాఖ జీవో నంబర్ 105ను జారీ చేసింది. పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లపై పురపాలక శాఖ జీవో నంబర్ 1065ను జారీ చేసింది. ఈ జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలయ్యాయి.

విచారణ సందర్భంగా రిజర్వేషన్లను ఖరారు చేయడానికి ఉపయోగించిన గణాంకాలు, వాటి ఆధారాలను హైకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం మాత్రం బీసీల సమకాలీన జనాభా వివరాల కోసం నిర్వహించిన యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా 34 శాతం రిజర్వేషన్లు నిర్ణయించినట్లు కోర్టుకు వివరించింది. తాజాగా హైకోర్టు జీవో 105, జీవో 1065లను కొట్టివేసింది. రిజర్వేషన్ల అంశంలో రాజ్యాంగ, న్యాయపరమైన పరిమితులను పాటించలేదని కోర్టు పేర్కొన్నట్లు నివేదికలు వెల్లడించాయి. దీంతో హైకోర్టు తీర్పుపై తదుపరి న్యాయపరమైన మార్గాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఇదిలా ఉండగా, హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆరు వారాల్లో పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. దీంతో ఒకవైపు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన చర్యలు కొనసాగుతుండగా, మరోవైపు 34 శాతం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం తీసుకునే తదుపరి న్యాయపరమైన నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com